https://oktelugu.com/

ఉచితంగా క్యాబ్ బుక్ చేసుకునే ఛాన్స్.. ఎలా అంటే..?

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయనే సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో ప్రముఖ క్యాబ్ సంస్థలలో ఒకటైన ఉబెర్ ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఉచితంగా క్యాబ్ లో ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పించింది. అయితే అందరూ ఉచితంగా క్యాబ్ లో ప్రయాణం చేయలేరు. కేవలం కరోనా వ్యాక్సిన్ వేయించుకునే వాళ్లకు మాత్రమే ఉచితంగా క్యాబ్ లో ప్రయాణించే అవకాశం కల్పిస్తోంది. Also Read: వాట్సాప్ యాప్ వాడేవాళ్లకు షాకింగ్ న్యూస్.? ప్రముఖ ట్యాక్సీ సర్వీసుల […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 20, 2021 11:51 am
    Follow us on

    Uber Offers

    దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయనే సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో ప్రముఖ క్యాబ్ సంస్థలలో ఒకటైన ఉబెర్ ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఉచితంగా క్యాబ్ లో ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పించింది. అయితే అందరూ ఉచితంగా క్యాబ్ లో ప్రయాణం చేయలేరు. కేవలం కరోనా వ్యాక్సిన్ వేయించుకునే వాళ్లకు మాత్రమే ఉచితంగా క్యాబ్ లో ప్రయాణించే అవకాశం కల్పిస్తోంది.

    Also Read: వాట్సాప్ యాప్ వాడేవాళ్లకు షాకింగ్ న్యూస్.?

    ప్రముఖ ట్యాక్సీ సర్వీసుల సంస్థలలో ఒకటిగా పేరు తెచ్చుకున్న ఉబెర్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌కు తమ వంతు సాయం అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బలహీన వర్గాలకు చెందిన వాళ్లు, పేదలు, సీనియర్ సిటిజన్స్ ఉచితంగా క్యాబ్ ను బుకింగ్ చేసుకోవచ్చు. కోవిడ్ యాప్ ద్వార రిజిష్టర్ చేసుకుంటే మాత్రమే ఫ్రీ క్యాబ్ బుకింగ్ బెనిఫిట్ ను పొందే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

    Also Read: స్మార్ట్ ఫోన్ ను పోగొట్టుకున్నారా.. ఎలా కనిపెట్టాలంటే..?

    కేవలం 50 రూపాయల వరకు మాత్రమే ఉచితంగా రైడ్ లభిస్తుంది. అంతకంటే ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటే మిగిలిన మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఉబెర్ ఇందుకోసం ప్రభుత్వాలతో కలిసి పని చేస్తూ ఉండటం గమనార్హం. 50 లక్షల మంది సీనియర్ సిటిజన్స్ కు ప్రయోజనం చేకూరేలా 10 కోట్ల రూపాయల వరకు విలువైన ఫ్రీ రైడ్స్ ను అందిస్తామని ఉబెర్ నుంచి ప్రకటన వెలువడింది.

    కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో వైరస్ కు పూర్తిస్థాయిలో సులభంగా చెక్ పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి.