https://oktelugu.com/

అమెరికా ఎన్నికల ఫలితాలు తీవ్ర ఆలస్యం?

అమెరికన్లు తీర్పు ఇచ్చేశారు. ఆ తీర్పు ఏంటనేది ఇప్పుడు తేలనుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ ముగియడంతో ఇప్పుడు కౌంటింగ్ మొదలుపెట్టారు. అమెరికాలో ప్రస్తుతం మూడు ప్రాథమిక మార్గాల్లో ఓటింగ్ వేయవచ్చు. ఎన్నికల రోజున వ్యక్తిగతంగా, ఎన్నికలకు ముందు ముందస్తుగా వేయవచ్చు. ఇక మూడో ఆప్షన్ మెయిల్-ఇన్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయవచ్చు. ఈసారి కోవిడ్ -19 మహమ్మారి కారణంగా చాలామంది అమెరికన్ ప్రజలు మెయిల్-ఇన్ ఓటింగ్ (పోస్టల్ బ్యాలెట్) ద్వారా ఓట్లను వేశారు. దాదాపు 10కోట్లకుపైగా […]

Written By:
  • NARESH
  • , Updated On : November 4, 2020 11:06 am
    Follow us on

    U.S. election results

    అమెరికన్లు తీర్పు ఇచ్చేశారు. ఆ తీర్పు ఏంటనేది ఇప్పుడు తేలనుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ ముగియడంతో ఇప్పుడు కౌంటింగ్ మొదలుపెట్టారు. అమెరికాలో ప్రస్తుతం మూడు ప్రాథమిక మార్గాల్లో ఓటింగ్ వేయవచ్చు. ఎన్నికల రోజున వ్యక్తిగతంగా, ఎన్నికలకు ముందు ముందస్తుగా వేయవచ్చు. ఇక మూడో ఆప్షన్ మెయిల్-ఇన్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయవచ్చు. ఈసారి కోవిడ్ -19 మహమ్మారి కారణంగా చాలామంది అమెరికన్ ప్రజలు మెయిల్-ఇన్ ఓటింగ్ (పోస్టల్ బ్యాలెట్) ద్వారా ఓట్లను వేశారు. దాదాపు 10కోట్లకుపైగా ఇలా వేశారని తెలిసింది. దీనివల్ల ఈ ఏడాది ఫలితాలను ప్రకటించడంలో ఆలస్యం అవుతుందని అంచనా వేస్తున్నారు. కరోనావైరస్ నేపథ్యంలో తమ ఓటు హక్కును మెయిల్ ద్వారా వినియోగించుకోవడం చాలా సురక్షితమని అమెరికన్లు ఇదే పద్ధతిలో ఈసారి ఓటు వేశారు. మీడియా నివేదిక ప్రకారం పోస్టల్ ఓట్లు భారీ సంఖ్యలో వచ్చాయని.. పోస్టల్ ఓట్లతో అభ్యర్థి ముందంజలో నిలువవచ్చని అంటున్నారు.

    మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు

    వృద్ధులు.. తీవ్రమైన రోగాలతో బాధపడుతున్న వారు లేదా వారి రాష్ట్రానికి దూరంగా ఉన్నవారు పోస్టల్ ద్వారా ఓటు వేయడానికి అనుమతిస్తారు. పోస్టల్ ఓట్లు సాధారణ బ్యాలెట్ కంటే లెక్కించడానికి ఎక్కువ సమయం పడుతుంది. ప్రతి ఓటుకు ఓటరు నమోదు కార్డుతో సరిపోలవలసిన సంతకం ఉండాలి. 2016 లో తుది ఓట్లు మొత్తం లెక్కించడానికి ఒక నెల కన్నా ఎక్కువ సమయం పట్టింది. ఇక వేర్వేరు రాష్ట్రాల్లో వాటిని లెక్కించాలో వేర్వేరు నియమాలను ఉంటాయి. ఉదాహరణకు ఫ్లోరిడా వంటి రాష్ట్రాలు ఎన్నికల రోజుకు ముందు పోస్టల్ ఓట్లను లెక్కించడం ప్రారంభిస్తాయి. మరికొందరు పోలింగ్ జరిగే వరకు వాటిని లెక్కించడం ప్రారంభించరు.

    Also Read: అమెరికా ఎన్నికల ఫలితాలు: ముందంజలో ఎవరంటే?

    అందువల్ల, ఓట్లు లెక్కించబడిన క్రమం ఆధారంగా ఎవరు లీడ్ లో ఉన్నారన్నది తేలుతుంది. డెమోక్రాట్లు ఈ సంవత్సరం మెయిల్ ద్వారా ఓటు వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ మేరకు ప్రచారం చేశారు. అరిజోనా, ఫ్లోరిడా మరియు నార్త్ కరోలినా వంటి పోస్టల్ బ్యాలెట్లను మొదట లెక్కించే రాష్ట్రాలు మొదట్లో బిడెన్‌కు అనుకూలంగా మారవచ్చు. వర్జీనియా మాదిరిగా వ్యక్తిగతంగా ఎన్నికల రోజు ఓట్లను నివేదించే రాష్ట్రాల్లో అధ్యక్షుడు ట్రంప్‌కు ఎక్కువగా ఓట్లు వచ్చే అవకాశం ఉంది.

    సాధారణంగా.. అమెరికాలో ఎన్నికల ఫలితాలు ఎన్నికల రోజు రాత్రి తెలుస్తాయి. పోలింగ్ జరిగిన కొద్ది గంటల్లోనే 270 ఎన్నికల ఓట్లను ఏ అభ్యర్థి సాధించాడనేది చూచాయగా తెలుస్తుంది. ఈ సంవత్సరం పోస్టల్ ఓట్లను లెక్కించడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు కాబట్టి చాలా రాష్ట్రాల్లో ఫలితాలు ఆలస్యం అవుతాయని భావిస్తున్నారు.

    Also Read: దుబ్బాక ఎగ్జిట్ పోల్: ఎవరిది గెలుపంటే?

    అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. రెండోసారి అధ్యక్షుడు కావాలని డొనాల్డ్ ట్రంప్ ఆశపడుతుండగా.. ఆయన ప్రత్యర్థి, డెమొక్రాట్ జో బిడెన్ వైట్ హౌస్ లో ఈసారి అడుగుపెట్టాలని యోచిస్తున్నారు. కరోనా దెబ్బతో చాలా ముందస్తు ఓటింగ్ వేయడం విశేషం. 98.7 మిలియన్లకు పైగా ప్రజలు తమ ఓట్లను మెయిల్ ద్వారా పంపారు. ఈ సంఖ్య పెరిగినట్టు తెలిసింది. మంగళవారం పోలింగ్ ప్రారంభమయ్యే కొన్ని గంటల ముందు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన చివరి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ఎన్నికలలో “అద్భుత విజయం” తన సొంతమవుతుందని స్పష్టం చేశారు. అయితే ఫలితాల్లో మాత్రం జోబైడెన్ ముందంజలో ఉండడం విశేషం.