మనలో చాలామంది కాకరకాయతో వండిన వంటకాలను తినడానికి పెద్దగా ఇష్టపడరు. ముదురు లేదా లేత ఆకుపచ్చ రంగులో ఉండే కాకరకాయ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కాకర కాయను జ్యూస్ రూపంలో తీసుకున్నా, ఫ్రై చేసినా, ఉడికించినా కాకర ద్వారా శరీరంలోకి వచ్చే పోషకాలు మనకు ఎంతో మేలు చేస్తాయి. కాకరకాయలో ఏ, బీ, సీ విటమిన్లతో పాటు పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం, ఐరన్. లుటీన్, కెరోటీన్ కూడా ఉంటాయి.
కాకరకాయ అనేక రోగాల బారిన పడకుండా మనల్ని రక్షిస్తుంది. షుగర్ తో బాధ పడే వాళ్లకు కాకరకాయ దివ్యౌషధంలా పని చేస్తుంది. కాకర ఆస్తమా, జలుబు, దగ్గు లాంటి శ్వాస సంబంధిత సమస్యలను సులువుగా దూరం చేస్తుంది. కాకరలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరచటంతో పాటు రోగాల బారిన పడకుండా రక్షిస్తుంది. రోజూ కాకరకాయ జ్యూస్ తాగితే లివర్ సంబంధిత సమస్యలు దూరమవుతాయి.
క్యాన్సర్, గుండెజబ్బులతో పాటు కడుపునొప్పి లాంటి సమస్యలను కూడా కాకర దూరం చేస్తుంది. కాకర తీసుకునేవారిలో మలబద్ధకం, జీర్ణాశయ సంబంధిత రోగాలు దూరమవుతాయి. మొటిమలు, మచ్చలు లాంటి అంటు వ్యాధుల నుంచి రక్షించడంలో కాకర సహాయపడుతుంది. శరీరంలో నుంచి ట్యాక్సిన్లను తొలగించడంలో కాకరకాయ సహాయపడుతుంది. కాకరలో కెలోరీలు, కొవ్వు, కారో హైడ్రేట్లు తక్కువగా ఉంటాయి.
అధిక బరువు సమస్యతో బాధ పడేవాళ్లు కాకర తీసుకుంటే జీవక్రియ అభివృద్ధి జరిగి తక్కువ సమయంలోనే సులువుగా బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి. రక్తాన్ని శుద్ధి చేసే ప్రక్రియను కాకర వేగవంతం చేస్తుంది. కాకర రోజూ తీసుకునేవారిలో జుట్టుకు మెరుపు రావడంతో పాటు చర్మం అందంగా మారుతుంది.