హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన సీఎం కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసులో ఊహించన ట్విస్ట్ నెలకొంది. ఇప్పటికే ఈ ఉదయం ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈరోజు సాయంత్రం ఈ కేసుపై ప్రెస్ మీట్ పెట్టిన హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తాజాగా సంచలన విషయం బయటపెట్టారు.
Also Read: చంద్రబాబు, లోకేష్.. టీడీపీ మీడియా పరువు తీసిన కొడాలి నాని
అందరూ అనుకుంటున్నట్టు ఈ కేసులో ఏ1గా ప్రధాన సూత్రధారి అఖిల ప్రియ కాదని సీపీ అంజనీకుమార్ తెలిపారు. కొత్తగా తెరమీదకు ఏవీ సుబ్బారెడ్డి పేరు వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఏవీ సుబ్బారెడ్డిగా పోలీసులు గుర్తించారు.
మొత్తం ఈ కిడ్నాప్ కేసులో ఏవీ సుబ్బారెడ్డి ప్రధాన పాత్రధారి అని.. ఆ తర్వాత అఖిలప్రియ అని సీపీ అంజనీకుమార్ తెలిపారు.ఈ మేరకు బాధితుల వాంగ్మూలం ప్రకారం ఏ1గా ఏవీ సుబ్బారెడ్డి,ఏ2గా భూమా అఖిలప్రియను చేర్చినట్టు తెలిపారు.
Also Read: ట్విట్టర్ ద్వారానే పవన్ ‘రామతీర్థం’ నిరసన?
నిజానికి గత కొన్నేళ్లుగా భూమా కుటుంబంతో ఏవీ సుబ్బారెడ్డికి తీవ్రమైన విభేదాలు , ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయి. కానీ అనూహ్యంగా ఏ1గా ఏవీ సుబ్బారెడ్డి పేరు తెరపైకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
హఫీజ్ పేట్ భూవ్యవహారమంతా తనకు తెలుసు అని.. ఈ దశలో తాను మాట్లాడనని ఏవీ సుబ్బారెడ్డి అన్నట్టు సమాచారం. అఖిలప్రియ, భార్గవ్ రామ్ పాత్రపై అన్ని వివరాలు తనకు తెలుసు అని సుబ్బారెడ్డి తెలిపినట్టు సమాచారం. ఆధారాలతో బయటపెడుతానని చెప్పినట్టు తెలిసింది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్