https://oktelugu.com/

బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త సర్వీసులు..!

సాధారణంగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే బ్యాంక్ బ్రాంచ్ కు వెళ్లి దరఖాస్తులో వివరాలు నమోదు చేసి బ్యాంక్ అకౌంట్ ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ ప్రక్రియ పూర్తి చేయాలంటే కనీసం ఒకరోజు సమయం పడుతుంది. అయితే ప్రముఖ బ్యాంకులలో ఒకటైన ఐడీబీఐ బ్యాంక్ కొత్తగా బ్యాంక్ అకౌంట్ ను ఓపెన్ చేయాలని అనుకునే వారికి అదిరిపోయే శుభవార్తను చెప్పింది. సులభంగా బ్యాంక్ అకౌంట్ ను ఓపెన్ చేసే అవకాశాన్ని కల్పించింది. Also Read: […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 6, 2021 / 06:57 PM IST
    Follow us on

    సాధారణంగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే బ్యాంక్ బ్రాంచ్ కు వెళ్లి దరఖాస్తులో వివరాలు నమోదు చేసి బ్యాంక్ అకౌంట్ ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ ప్రక్రియ పూర్తి చేయాలంటే కనీసం ఒకరోజు సమయం పడుతుంది. అయితే ప్రముఖ బ్యాంకులలో ఒకటైన ఐడీబీఐ బ్యాంక్ కొత్తగా బ్యాంక్ అకౌంట్ ను ఓపెన్ చేయాలని అనుకునే వారికి అదిరిపోయే శుభవార్తను చెప్పింది. సులభంగా బ్యాంక్ అకౌంట్ ను ఓపెన్ చేసే అవకాశాన్ని కల్పించింది.

    Also Read: వాహనదారులకు అలర్ట్.. డ్రైవింగ్ లైసెన్స్ నియమనిబంధనల్లో మార్పులు..?

    ఐడీబీఐ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలనుకునే కస్టమర్లు ఇంటి నుంచి లేదా ఆఫీస్ నుంచి సులభంగా బ్యాంక్ అకౌంట్ ను ఓపెన్ చేయవచ్చు. ఎటువంటి ఫిజికల్ డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం లేకుండానే డిజిటల్ సర్వీసుల ద్వారా బ్యాంక్ అకౌంట్ ను ఓపెన్ చేయవచ్చు. కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చేందుకు ఐడీబీఐ బ్యాంక్ వీడియో కేవైసీ అకౌంట్ ఓపెనింగ్ సర్వీసులు అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం.

    Also Read: పేటీఎం యూజర్లకు బంపర్ ఆఫర్.. సులభంగా లోన్ పొందే ఛాన్స్..?

    బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేందుకు డిజిటల్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చినట్టు సమాచారం. vkyc.idbibank.co.in లింక్ సహాయంతో సులభంగా బ్యాంక్ అకౌంట్ ను ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. కొత్తగా బ్యాంక్ అకౌంట్ ను ఓపెన్ చేయాలనుకునే కస్టమర్లు బ్యాంకు పని దినాల్లో మాత్రమే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

    మరిన్ని వార్తల కోసం: ప్రత్యేకం

    ఇప్పటికే పలు బ్యాంకులు డిజిటల్ సర్వీసులను అందిస్తుండగా ఇతర బ్యాంకులు సైతం డిజిటల్ సర్వీసులను అందించే దిశగా అడుగులు వేస్తున్నాయి. డిజిటల్ సర్వీసులు అందుబాటులోకి రావడం వల్ల బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి భారీగా ప్రయోజనం చేకూరుతుంది.