https://oktelugu.com/

ట్రంప్‌ మరో భారీ కుట్ర

చివరి ఓటు లెక్కింపు వరకు కూడా తన ఓటమిని అంగీకరించేది లేదంటూ అగ్రదేశ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మొదటి నుంచి చెబుతున్న మాట. ఇప్పటికే జో బైడెన్‌ గెలుపు ఖాయమైనప్పటికీ ఇంకా ఓటమిని మాత్రం అంగీకరించడం లేదు. అంతే కాదు.. తాను గెలిచినట్లు నిరూపించుకునేందుకు ఇంకా కుఠిల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. Also Read: కాంగ్రెస్‌కు షాక్‌ల మీద షాక్‌లు అధికార పీఠాన్ని వదిలేది లేదంటూ తాజాగా మరో భారీ కుట్రకు సిద్ధపడ్డారు ట్రంప్‌. ఇటీవలి అధ్యక్ష […]

Written By:
  • NARESH
  • , Updated On : November 21, 2020 4:16 pm
    Follow us on

    Trump

    చివరి ఓటు లెక్కింపు వరకు కూడా తన ఓటమిని అంగీకరించేది లేదంటూ అగ్రదేశ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మొదటి నుంచి చెబుతున్న మాట. ఇప్పటికే జో బైడెన్‌ గెలుపు ఖాయమైనప్పటికీ ఇంకా ఓటమిని మాత్రం అంగీకరించడం లేదు. అంతే కాదు.. తాను గెలిచినట్లు నిరూపించుకునేందుకు ఇంకా కుఠిల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

    Also Read: కాంగ్రెస్‌కు షాక్‌ల మీద షాక్‌లు

    అధికార పీఠాన్ని వదిలేది లేదంటూ తాజాగా మరో భారీ కుట్రకు సిద్ధపడ్డారు ట్రంప్‌. ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్‌కు 306, ట్రంప్‌కు 232 ఓట్లు వచ్చిన విషయం తెలిసిందే. 270 మేజిక్‌ ఫిగర్‌ కోసం ఇంకా ప్రయత్నిస్తున్న ట్రంప్‌.. తాజాగా 46 స్థానాల్లో ఎన్నికలను వివాదాస్పదం చేయాలనుకున్నారు. శుక్రవారం మిషిగాన్‌కు చెందిన తన పార్టీ (రిపబ్లికన్‌) చట్టసభ్యులను వైట్‌హౌ్‌సకు పిలిపించుకున్నారు.

    ఆ రాష్ట్రంలో ఉన్న 16 స్థానాల్లో.. బైడెన్‌-కమల హ్యారిస్‌కు ఓట్లు వచ్చిన విషయాన్ని నిర్ధారించకూడదని.. అవి తన ఖాతాలో పడ్డట్లుగానే గుర్తించాలని వారిని కోరారు. ఇదేవిధంగా.. పెన్సిల్వేనియాలోని 20 స్థానాలు, విస్కోన్సిన్‌లోని 10 స్థానాలను అక్రమంగా తన ఖాతాలో వేసుకోవాలని వ్యూహం పన్నారు. అంతా అనుకున్నట్లే జరిగితే.. ట్రంప్‌కు వచ్చిన స్థానాల సంఖ్య 232 నుంచి 278కి పెరుగుతుంది. ట్రంప్‌ చర్యలు సరికావని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

    Also Read: జనసేన సైడ్‌ అవ్వడం.. జనసేనానికే లాభం?

    రెండోసారి కూడా ఎలాగైనా పీఠం దక్కించుకోవాలని ట్రంప్‌ చేస్తున్న ప్రయత్నాలు అన్నీఇన్నీ కావు. ఓ అగ్రదేశ అధ్యక్షుడిగా ఉండి కూడా ఇలాంటి కుట్రలు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రత్యర్థి పార్టీ వారు రిగ్గింగ్‌ పాల్పడ్డారని.. అందుకే గెలిచారని చెప్పుకొస్తున్న ట్రంప్‌.. మరి ఇప్పుడు ఆయన చేస్తున్న ఈ దుర్మార్గాన్ని ఏమనాలోనని ప్రశ్నిస్తున్నారు.

    మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు