జనసేన సైడ్‌ అవ్వడం.. జనసేనానికే లాభం?

‘ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే’ పవన్‌ కల్యాణ్‌.. ఎందుకంటే ఆ డైలాగ్‌ ఆయన సినిమాలోనిదే కదా. అయితే.. హైదరాబాద్‌ ఎన్నికల్లో పోటీ నుంచి వైదొలిగి ఇప్పుడు బీజేపీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇది కాస్త విమర్శలకు తెరతీసింది. అయితే.. పవన్ కల్యాణ్ రాజకీయ భవిష్యత్ ఇప్పటికిప్పుడు విమర్శలు రావొచ్చు కానీ.. కొన్నాళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఆయన ఎందుకు తగ్గారో దానికి ఎంత రాజకీయ ప్రయోజనం పొందారో స్పష్టంగా తెలిసిపోతుంది. Also […]

Written By: NARESH, Updated On : November 21, 2020 4:21 pm
Follow us on

‘ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే’ పవన్‌ కల్యాణ్‌.. ఎందుకంటే ఆ డైలాగ్‌ ఆయన సినిమాలోనిదే కదా. అయితే.. హైదరాబాద్‌ ఎన్నికల్లో పోటీ నుంచి వైదొలిగి ఇప్పుడు బీజేపీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇది కాస్త విమర్శలకు తెరతీసింది. అయితే.. పవన్ కల్యాణ్ రాజకీయ భవిష్యత్ ఇప్పటికిప్పుడు విమర్శలు రావొచ్చు కానీ.. కొన్నాళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఆయన ఎందుకు తగ్గారో దానికి ఎంత రాజకీయ ప్రయోజనం పొందారో స్పష్టంగా తెలిసిపోతుంది.

Also Read: కాంగ్రెస్‌కు షాక్‌ల మీద షాక్‌లు

గ్రేటర్ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పోటీ చేయడం అనేది మామూలుగా ఎవరూ పట్టించుకునేది విషయం కాదు. ఒకప్పుడు మేయర్ సీటు ఏలిన టీడీపీ గత బల్దియా ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన టీడీపీ పోటీనే ఇప్పుడు అక్కడ నామమూత్రం అయింది. అలాంటప్పుడు.. సినీ ఫ్యాన్స్‌ను మాత్రమే నమ్ముకుని బరిలోకి దిగాలని పవన్ కల్యాణ్ కూడా అనుకుని ఉండరు. కానీ.. పోటీ చేస్తానని ప్రకటించేశారు. అభ్యర్థుల్ని కూడా ఖరారు చేశారు. ఎందుకంటే.. బీజేపీకి తానెంత కీలకమో చెప్పాలనుకున్నారు. తను లెక్కలేనట్లు వ్యవహరిస్తున్న వారికి తన విలువేంటో చెప్పాలనుకున్నారు. కార్యకర్తలను సిద్ధం చేశారు. నిజంగా పవన్ కల్యాణ్.. తాను అనుకున్న ఎఫెక్ట్ తీసుకు వచ్చారు. దెబ్బకి బీజేపీ దిగి వచ్చింది.

గ్రేటర్‌లో పవన్ పోటీ చేసినా.. ఒక్క కార్పొరేటర్ సీటు అయినా వస్తుందో లేదో గ్యారంటీ లేదు. ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడు.. ఆ పార్టీ తరపున గ్రేటర్‌లో పోటీ చేసినప్పుడు ఒక్క కార్పొరేటర్ సీటు మాత్రమే గెలిచింది. అప్పుడు టీడీపీ 45, కాంగ్రెస్ 50కిపైకా కార్పొరేటర్ సీట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో పోటీ చేయడానికి టీఆర్ఎస్ సాహసించలేకపోయింది. పీఆర్పీకే ఒక్క సీటు వచ్చినప్పుడు పవన్ కల్యాణ్ కు.. డిపాజిట్లు వస్తాయన్న గ్యారంటీ ఉండదు. ఇప్పుడు బీజేపీకి గ్రేటర్‌లో పాజిటివ్ మూడ్ ఉంది. పోటీ చేయకుండా మద్దతివ్వడం వల్ల.. బీజేపీ సాధించే ఫలితాల్లో ఎంతో కొంత క్రెడిట్ దక్కుంది. అందులో సందేహం లేదు.

Also Read: ఆకర్ష్‌తో బీజేపీ పరువు తీసుకుంటోందా..?

అంతకుమించి పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లో తగ్గడం వల్ల ఏపీలో అడ్వాంటేజ్ సాధించినట్లే. తెలంగాణలో ఆ పార్టీ ఎదుగుదల కోసం.. చేసిన త్యాగాన్ని బీజేపీ ఏపీలో గుర్తించాల్సి ఉంటుంది. బీజేపీ హైకమాండ్ కూడా పవన్ కల్యాణ్.. తమ పార్టీ కోసం చేసిన త్యాగాల్ని గుర్తించక తప్పదు. లేకపోతే.. పవన్ కల్యాణ్‌ను వాడేసుకుని వదిలేశారన్న అభిప్రాయం ఆయన ఫ్యాన్స్‌లో ఏర్పడుతుంది. అదే జరిగితే నష్టపోయేది బీజేపీనే. అందుకే.. ఏ విధంగా చూసినా గ్రేటర్ ఎన్నికల బరి నుంచి తగ్గాలనే విషయంలోనే పవన్ కల్యాణ్ నిర్ణయం లాభించే అంశనేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్