https://oktelugu.com/

తెలంగాణలో సెకండ్‌ వేవ్‌.. ఈటల ఏంటీ మాటలు?

చైనా దేశంలోని వూహాన్ మహానగరంలో పుట్టిన కరోనా వైరస్‌.. ఆ వైరస్‌తో ప్రజలు గజగజ వణుకుతున్న వేళ ప్రపంచ దేశాలన్ని కరోనాను అంత సీరియస్‌గా తీసుకోలేదు. దీనికి ఎంత భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందో అందరికీ తెలిసిందే. మన దేశంలో కూడా కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్న వేళ.. యూరప్ దేశాల్లో తగ్గుముఖం పట్టాయి. జన జీవన స్రవంతి సాధారణం కావటం.. ఎప్పటిలానే తమ కార్యకలాపాలను నిర్వర్తించాయి. Also Read: జనసేన సైడ్‌ అవ్వడం.. జనసేనానికే […]

Written By:
  • NARESH
  • , Updated On : November 21, 2020 / 02:53 PM IST
    Follow us on

    చైనా దేశంలోని వూహాన్ మహానగరంలో పుట్టిన కరోనా వైరస్‌.. ఆ వైరస్‌తో ప్రజలు గజగజ వణుకుతున్న వేళ ప్రపంచ దేశాలన్ని కరోనాను అంత సీరియస్‌గా తీసుకోలేదు. దీనికి ఎంత భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందో అందరికీ తెలిసిందే. మన దేశంలో కూడా కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్న వేళ.. యూరప్ దేశాల్లో తగ్గుముఖం పట్టాయి. జన జీవన స్రవంతి సాధారణం కావటం.. ఎప్పటిలానే తమ కార్యకలాపాలను నిర్వర్తించాయి.

    Also Read: జనసేన సైడ్‌ అవ్వడం.. జనసేనానికే లాభం?

    ఇప్పుడు సెకండ్ వేవ్ అమెరికాతోపాటు యూరప్ దేశాల్ని వణికిస్తోంది. మన దేశానికి వస్తే.. సెకండ్.. థర్డ్ వేవ్ అంటూ ఢిల్లీ రాష్ట్రంతోపాటు కేరళను కూడా చేర్చారు. ప్రపంచంలోని పలు దేశాల్లో నడుస్తున్న కరోనా ట్రెండ్ తో పోలిస్తే.. భారత్‌లో పరిస్థితి ఇప్పుడు మెరుగ్గా ఉందని చెప్పాలి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పట్టాయి. ఏపీతో పోలిస్తే.. తెలంగాణలో కేసుల నమోదు మరింత తగ్గింది. గ్రేటర్ హైదరాబాద్ విషయానికి వస్తే ప్రస్తుతం రోజు 200 కంటే తక్కువ.. అప్పుడప్పుడు 140 కంటే తక్కువ కేసులు నమోదువుతున్నాయి.

    కరోనా సెకండ్‌ వేవ్‌ అంటూ ప్రచారం నడుస్తుండడంతో తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రత తెలంగాణ రాష్ట్రం మీద పెద్దగా ఉండదని తేల్చి చెబుతున్నారు. అయితే.. అది తన వ్యక్తిగత అభిప్రాయంగా చెప్పారు కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడితే దాన్ని ఎదుర్కోవటానికి సామర్థ్యం ఉందంటున్నారు.

    Also Read: ఆకర్ష్‌తో బీజేపీ పరువు తీసుకుంటోందా..?

    నిజానికి తెలంగాణ సర్కారు సత్తా ఏమిటన్నది కరోనా ఫస్ట్ ఫేజ్ లోనే అందరికీ అర్థమైంది. అలాంటిది సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న వేళ.. మరీ ఇంత ధీమా అవసరమా..? ఫస్ట్‌ వేవ్‌ను ఎంత వరకు అడ్డుకున్నారని.. సెకండ్‌ వేవ్‌పై ఇలా మాట్లాడుతున్నారు..? మాటలు చెప్పి నిర్లక్ష్యం చేస్తే అది మొదటికే మోసం వస్తుంది. అనవసరమైన ధీమాతో తిప్పలు తప్పవన్న విషయాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతకీ.. ఈటల దగ్గర ఉన్న ఆ మంత్రాంగం ఏంటో ఆయనకే తెలియాలి మరి.