https://oktelugu.com/

టీఆర్‌‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీ: రాష్ట్రంలో భీకర వాతావరణం

ఆత్మాహుతి మంటలతో ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. ఆత్మహత్యాయాత్నలు.. ఆత్మాహుతి దాడులు ఉద్యమాన్ని మరింత రాజుకునేలా చేశాయి. ఢిల్లీ పెద్దలు దిగొచ్చేలా ఉద్యమం నడిచింది. అయితే.. అదంతా ప్రత్యేక రాష్ట్రం కోసం త్యాగధనులు చేసిన త్యాగం. ఇప్పుడు మళ్లీ అదే రాష్ట్రంలో ఆత్మాహుతి మంటలు మొదలయ్యాయి. అవి ఏకంగా రాజకీయ నేతల కోసం జరుగుతున్నాయి. Also Read: బీజేపీకి గట్టి దెబ్బ.. రూ.కోటి తరలిస్తుండగా రఘునందన్ బావమరిది అరెస్ట్ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి […]

Written By:
  • NARESH
  • , Updated On : November 2, 2020 / 10:33 AM IST
    Follow us on

    ఆత్మాహుతి మంటలతో ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. ఆత్మహత్యాయాత్నలు.. ఆత్మాహుతి దాడులు ఉద్యమాన్ని మరింత రాజుకునేలా చేశాయి. ఢిల్లీ పెద్దలు దిగొచ్చేలా ఉద్యమం నడిచింది. అయితే.. అదంతా ప్రత్యేక రాష్ట్రం కోసం త్యాగధనులు చేసిన త్యాగం. ఇప్పుడు మళ్లీ అదే రాష్ట్రంలో ఆత్మాహుతి మంటలు మొదలయ్యాయి. అవి ఏకంగా రాజకీయ నేతల కోసం జరుగుతున్నాయి.

    Also Read: బీజేపీకి గట్టి దెబ్బ.. రూ.కోటి తరలిస్తుండగా రఘునందన్ బావమరిది అరెస్ట్

    బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్టుకు నిరసనగా బీజేపీ ఆఫీసు ముందు శ్రీనివాస్ అనే కార్యకర్త పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. పార్టీ కోసం.. పార్టీ నేత కోసం ప్రాణం ఇస్తానంటూ ఆయన పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. శ్రీనివాస్‌కు యాభై శాతం కాలిన గాయాలతో హాస్పిటల్‌లో చేరాడు. ఇప్పుడు ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ఘటన గురించి తెలిసిన వెంటనే.. దుబ్బాక ఎన్నికల ప్రచారంలో ఉన్న బీజేపీ నేతలు వెంటనే హుటాహుటిన శ్రీనివాస్‌ను పరామర్శించేందుకు వచ్చారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి కూడా ఆస్పత్రికి వెళ్లారు. ప్రభుత్వంపై మండిపడ్డారు. నిరసనలకు పిలుపునిచ్చారు.

    ఈ ఘటన అలా జరిగిందో లేదో.. మంత్రి కేటీఆర్‌‌ ఒక్కసారిగా మీడియా ముందుకు వచ్చారు. శ్రీనివాస్ ఆత్మాహుతి ఘటన కేంద్రంగా హైదరాబాద్‌లో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. దీనిపై తమకు పక్కా సమాచారం ఉందన్నారు. ప్రగతిభవన్, తెలంగాణభవన్, డీజీపీ కార్యాలయాలను ముట్టడించి.. పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టి.. పోలీసుల కాల్పులకు దారి తీసేలా బీజేపీ చేయబోతోందని కేటీఆర్ అనుమానిస్తున్నారు. ఇదే విషయాన్ని పార్టీ కార్యకర్తలకు బండి సంజయ్ చెప్పారంటున్నారు. దీనిపై ప్రత్యేకంగా టీఆర్ఎస్ నేతల బృందం డీజీపీకి ఫిర్యాదు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు.

    Also Read: హైదరాబాద్‌ కేంద్రంగా బీజేపీ కుట్ర.. కేటీఆర్‌‌ సంచలన వ్యాఖ్యలు

    కేటీఆర్‌‌ చేసిన ఆరోపణలపై బీజేపీ ఫైర్‌‌ అయింది. వెంటనే శ్రీనివాస్ ఆత్మాహుతి ఘటనపై తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. బీజేపీ కార్యకర్తలపై కాల్పులంటూ జరిగితే.. రాష్ట్రపతి పాలన విధిస్తారని హెచ్చరించారు. కేటీఆర్ బెదిరిస్తున్నరాని లక్ష్మణ్, అర్వింద్ మండిపడ్డారు. కేటీఆర్ బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. మొత్తానికి దుబ్బాక ఉప ఎన్నిక ఏమో కానీ.. రాష్ట్రంలో మాత్రం టీఆర్‌‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీ రాజకీయాలు మాత్రం భీకరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి.
    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్