https://oktelugu.com/

ఫైర్‌‌ బ్రాండ్ రోజా‌ ఎందుకు మౌనం పాటిస్తున్నట్లు..?

ఫైర్‌‌ బ్రాండ్‌గా పేరొందిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఈ మధ్య మౌనంగా ఉండిపోయారు. ఎక్కడా మీడియా ముందుకు వచ్చిన దాఖలాలు లేవు. కనీసం తన సొంత నియోజకవర్గంలోనే అన్యాయం జరుగుతున్నా నోరు విప్పడం లేదు. ప్రభుత్వం తరఫున కానీ.. పార్టీ తరఫున కానీ ఎక్కడా కార్యక్రమాల్లోనూ కనిపించడం లేదు. అంతేకాదు.. ఈ ఫైర్‌‌ బ్రాండ్‌ కాస్త ఎప్పుడో బరస్ట్‌ అవుతారన్న టాక్‌ నడుస్తోందట. Also Read: జగన్‌ ఎత్తులకు చంద్రబాబు పైఎత్తులు నగరి ఎమ్మెల్యేగా ఆర్కే […]

Written By:
  • NARESH
  • , Updated On : November 2, 2020 / 11:01 AM IST
    Follow us on

    ఫైర్‌‌ బ్రాండ్‌గా పేరొందిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఈ మధ్య మౌనంగా ఉండిపోయారు. ఎక్కడా మీడియా ముందుకు వచ్చిన దాఖలాలు లేవు. కనీసం తన సొంత నియోజకవర్గంలోనే అన్యాయం జరుగుతున్నా నోరు విప్పడం లేదు. ప్రభుత్వం తరఫున కానీ.. పార్టీ తరఫున కానీ ఎక్కడా కార్యక్రమాల్లోనూ కనిపించడం లేదు. అంతేకాదు.. ఈ ఫైర్‌‌ బ్రాండ్‌ కాస్త ఎప్పుడో బరస్ట్‌ అవుతారన్న టాక్‌ నడుస్తోందట.

    Also Read: జగన్‌ ఎత్తులకు చంద్రబాబు పైఎత్తులు

    నగరి ఎమ్మెల్యేగా ఆర్కే రోజా రెండోసారి గెలిచారు. తొలిసారి గెలిచినప్పుడే రోజా ఆనందంగా ఉండేవారట. ఇప్పుడు తన పార్టీ అధికారంలో ఉన్నా ఎమ్మెల్యేగా ఉండి ఏమీ చేయలేకపోతున్నారనే ఆవేదనలో ఉన్నారట. ఆర్కే రోజా టీడీపీ నుంచి వైసీపీలో చేరినా జగన్‌కు అత్యంత నమ్మకమైన నేతగా ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అయితే జగన్‌కు రైడ్‌ హ్యాండ్‌గా ఉండిపోయారు. అసెంబ్లీలోనూ తనదైన శైలిలో విరుచుకుపడేవారు. అలా విరుచుకుపడి ఏడాది పాటు సస్పెండ్‌కు కూడా గురయ్యారు.

    రాష్ట్రంలోనూ ఏ చిన్న ఘటన జరిగినా రోజా వెళ్లేవారు. సినీ గ్లామర్ కూడా తోడవ్వడంతో రోజా పర్యటనలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విజయవంతమయ్యాయి. దీనిని గుర్తించిన జగన్‌ కూడా రోజాను ప్రోత్సహించేవారు. స్వయంగా ఫోన్‌ చేసి కార్యక్రమాలకు వెళ్లమని చెప్పేవారు. అలాంటి రోజాకు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కష్టాలు ఎక్కువయ్యాయంటున్నారు. నగరి నియోజకవర్గంలో తన మాట చెల్లుబాటు కాకుండా చేస్తుండటం ఆమెకు మింగుడపడటం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బయటపడినా ప్రయోజనం లేదని సన్నిహితులు వారించడంతో రోజా మౌనంగా ఉండిపోతున్నారు.

    Also Read: అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు రైట్‌ రైట్‌

    రోజాకు ఎక్కడ అన్యాయం జరిగినా ఆమె అంతలా సైలెంట్‌గా ఉండిపోరు. వెంటనే కడిగేస్తుంటారు. అలాంటిది తన ప్రత్యర్థికి ఈడిగ కార్పొరేషన్ చైర్మన్ పదవి లభించినా రోజా మౌనంగానే ఉండిపోయారు. ప్రతీ విషయాన్ని జగన్ వద్దే తేల్చుకుంటానని చెప్పే రోజా ఇప్పుడు మాట కూడా మాట్లాడడం లేదు. అయితే.. ఇదంతా జగన్‌కు తెలిసే జరుగుతోందని రోజా భావిస్తుండగా.. అందుకే ఇలా ఎదురుచూస్తున్నారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్