తెలంగాణలో టీఆర్ఎస్ వేవ్ తగ్గుముఖం పడుతుండగా బీజేపీ క్రమంగా బలపడుతోంది. దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకొని గులాబీ బాస్ కు షాకిచ్చింది.
Also Read: వెంకటరెడ్డికి కొత్త తలనొప్పి
ఆ తర్వాత వచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ కు ధీటుగా సీట్లు సాధించి బీజేపీ సత్తాచాటింది. ఈక్రమంలోనే బీజేపీలోకి అన్ని పార్టీల నుంచి వలసలు మొదలయ్యాయి.
2023 ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈక్రమంలోనే బీజేపీలో వలసలు షూరు అయ్యాయి. అయితే తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ టీఆర్ఎస్ కు చెందిన 25మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వస్తానంటూ ఆహ్వానిస్తామని బండి సంజయ్ చెప్పారు. త్వరలోనే రాజగోపాల్ రెడ్డిని తాను కలువనున్నట్లు చెప్పారు.రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలనే కారణంతోనే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పక్కనపెట్టినట్లు బండి సంజయ్ తెలిపారు.
Also Read: దిగిపోయే ముందు అందరికీ షాకులిస్తున్న ట్రంప్
అదేవిధంగా శుక్రవారం గవర్నర్ తమిళ సై ను నూతన సంవత్సరం సందర్భంగా మార్యద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కొత్తగా గెలిచిన కార్పొరేటర్లను గుర్తింపు దక్కేలా ఎస్ఈసీ గెజిట్ ఉత్తర్వులు జారీ చేయించాలని కోరారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓడిపోయిన కార్పొరేటర్లు శంకుస్థాపనలు.. పలు కార్యక్రమాలు చేస్తున్నారని.. కొత్తవారిని ఎందుకు ఆహ్వానించడం బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ కార్పొరేటర్లు అవినీతి.. అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్