https://oktelugu.com/

‘బండి’ వ్యాఖ్యలకు ‘బాలరాజు’ కౌంటర్..!

తెలంగాణలో కొద్దిరోజులుగా టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇదే సమయంలో రాష్ట్రంలో బీజేపీ బలపడుతోంది. ఈ పరిస్థితి టీఆర్ఎస్ కు మింగుడు పడటం లేదు. Also Read: పోయినేడాది కంటే ఎక్కువే తాగేశారు ఇటీవల జరిగిన వరుస ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ కు బీజేపీ గట్టి పోటీనిచ్చింది. దీంతో టీఆర్ఎస్ వ్యతిరేకులంతా బీజేపీ వైపు ఆకర్షితలవుతున్నారు. దీంతో బీజేపీలోకి అన్ని పార్టీల నుంచి వలసలు మొదలయ్యాయి. ఈక్రమంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ […]

Written By: , Updated On : January 1, 2021 / 04:21 PM IST
BJP-TRS
Follow us on

BJP vs TRS
తెలంగాణలో కొద్దిరోజులుగా టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇదే సమయంలో రాష్ట్రంలో బీజేపీ బలపడుతోంది. ఈ పరిస్థితి టీఆర్ఎస్ కు మింగుడు పడటం లేదు.

Also Read: పోయినేడాది కంటే ఎక్కువే తాగేశారు

ఇటీవల జరిగిన వరుస ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ కు బీజేపీ గట్టి పోటీనిచ్చింది. దీంతో టీఆర్ఎస్ వ్యతిరేకులంతా బీజేపీ వైపు ఆకర్షితలవుతున్నారు. దీంతో బీజేపీలోకి అన్ని పార్టీల నుంచి వలసలు మొదలయ్యాయి.

ఈక్రమంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ 25మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీ నేతలతో టచ్లో ఉన్నారని చెప్పడం సంచలనంగా మారింది. దీంతో టీఆర్ఎస్ వర్గాల్లో కలకలం మొదలైంది.

బండి సంజయ్ వ్యాఖ్యలను తిప్పికొట్టకపోతే జరిగే ప్రమాదాన్ని గుర్తించిన టీఆర్ఎస్ ఎదురుదాడికి సిద్ధమైంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తాజాగా మీడియా సమావేశం నిర్వహించి బండి సంజయ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు.

Also Read: బీజేపీ టచ్లోకి 25మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు?

టీఆర్ఎస్ లోని ఎమ్మెల్యేలంతా నిబద్ధత కలిగిన వారని గుర్తుచేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలు అర్ధరహితంగా ఉన్నాయంటూ కొట్టిపారేశారు. జీహెచ్ఎంసీలో కొన్ని సీట్లు గెలిచినంత మాత్రనా ఒరిగేది ఏమిలేదని తేల్చిచెప్పారు.

బీజేపీ కార్పొరేటర్లే టీఆర్ఎస్ నేతలతో టచ్లో ఉన్నారంటూ కామెంట్ చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేతలు పగటి కలలు కంటున్నారనంటూ బాలరాజు ఎద్దేవా చేశారు. దీనిపై బీజేపీ నేతలు ఎలా రియాక్టవుతారో వేచిచూడాల్సిందే..!

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్