డిప్లొమా పాసైన వాళ్లకు శుభవార్త.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..?

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) డిప్లొమా పాసైన నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలలో ఒకటైన ఈ సంస్థ కర్ణాటక రాష్ట్రంలోని బెల్ లో అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి సిద్ధమైంది. మొత్తం 305 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల కాగా ఆసక్తి, ఆర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈరోజు నుంచి ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జనవరి 19వ తేదీ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి […]

Written By: Kusuma Aggunna, Updated On : January 5, 2021 11:46 am
Follow us on

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) డిప్లొమా పాసైన నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలలో ఒకటైన ఈ సంస్థ కర్ణాటక రాష్ట్రంలోని బెల్ లో అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి సిద్ధమైంది. మొత్తం 305 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల కాగా ఆసక్తి, ఆర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈరోజు నుంచి ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జనవరి 19వ తేదీ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరితేదీగా ఉంది.

Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. షిప్‌యార్డ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..?

https://bel-india.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆన్ లైన్ లో మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు సమాచారం ఇస్తారు. బోర్డ్ ఆఫ్ అప్రెంటిస్ షిప్ ట్రైనింగ్ ద్వారా అభ్యర్థులకు షార్ట్ లిస్ట్ చేస్తారు. 22 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Also Read: పదో తరగతి విద్యార్థులకు 80 మార్కులకే పరీక్ష.. కానీ..?

ఎంపికైన అభ్యర్థులకు అప్రెంటిస్‌షిప్ చట్టం ప్రకారం సంవత్సరం పాటు కొర్సు వ్యవధి ఉంటుంది. అభ్యర్థులకు 10,400 రూపాయలు స్టైఫెండ్ గా లభిస్తుంది. ప్రభుత్వ నియమనిబంధనల ప్రకారం వయో సడలింపులు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. స్టేట్ కౌన్సిల్ ఎడ్యుకేష‌న్ గుర్తింపు ఉన్న సంస్థల నుంచి సంబంధిత విభాగంలో డిగ్రీలు చేసిన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు

https://bel-india.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. 2018, 2019, 2020 సంవత్సరాల్లో పాసైన అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.