https://oktelugu.com/

ట్రైన్ టికెట్ బుకింగ్ కు కొత్త రూల్స్.. బుక్ చేయాలంటే అవి కావాల్సిందే..?

మన దేశంలో చాలామంది ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే రైలు మార్గం ద్వారా ప్రయాణం చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇండియన్ రైల్వేస్ రైలు ప్రయాణికుల కోసం కొత్త నిబంధనలను అమలులోకి తీసుకురానుందని తెలుస్తోంది. ఈ కొత్త నిబంధనల వల్ల రైల్వే టికెట్ బుక్ చేసుకునే విధానంలో మార్పులు రానున్నాయని తెలుస్తోంది. ఆన్ లైన్ లో టికెట్లు బుకింగ్ చేసుకునే వాళ్లపై ఈ ప్రభావం పడనుంది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఇకపై రైలు టికెట్లను […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : June 27, 2021 / 06:20 PM IST
    Follow us on

    మన దేశంలో చాలామంది ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే రైలు మార్గం ద్వారా ప్రయాణం చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇండియన్ రైల్వేస్ రైలు ప్రయాణికుల కోసం కొత్త నిబంధనలను అమలులోకి తీసుకురానుందని తెలుస్తోంది. ఈ కొత్త నిబంధనల వల్ల రైల్వే టికెట్ బుక్ చేసుకునే విధానంలో మార్పులు రానున్నాయని తెలుస్తోంది. ఆన్ లైన్ లో టికెట్లు బుకింగ్ చేసుకునే వాళ్లపై ఈ ప్రభావం పడనుంది.

    రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఇకపై రైలు టికెట్లను బుక్ చేసుకోవాలని భావించే వాళ్ల కోసం ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డులను అనుసంధానం చేయాల్సి ఉంటుంది. నివేదికల ప్రకారం ఇప్పటికే ఇందుకు సంబంధించిన కసరత్తు సైతం పూర్తైంది. రైల్వే టిక్కెట్ల అక్రమ కొనుగోలును నియంత్రించడానికి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తోంది. కొత్త నిబంధనలు అమలులోకి వస్తే ఐడెంటిటీ ప్రూఫ్ నంబర్లను ఎంటర్ చేయాలి.

    ఈ నిబంధనలు అమలులోకి వస్తే ఆన్ లైన్ లో టికెట్ ను బుకింగ్ చేయాలంటే ఆధార్ నెంబర్ లేదా పాన్ నెంబర్ లేదా ఇతర ఐడెంటిటీ ప్రూఫ్ నెంబర్లను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల టికెట్లు ఎవరు బుక్ చేశారనే విషయం కచ్చితంగా తెలిసే అవకాశం ఉంటుంది. బ్లాక్ టికెట్లను స్కామ్‌ కు ఈ విధంగా చెక్ పెట్టాలని ఇండియన్ రైల్వే భావిస్తుండటం గమనార్హం.

    2018 నుంచి మే నెల నాటికి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఇప్పటివరకు ఏకంగా బ్లాక్ టికెట్ల స్కామ్ కు సంబంధించి 14 వేల మందిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. బ్లాక్ మార్కెట్‌లో రైల్వే టికెట్లను విక్రయించే వారిపై రైల్వే శాఖ కఠిన చర్యలు తీసుకుంటోంది. వీటికి చెక్ పెట్టడానికి రైల్వే శాఖ కొత్త నిబంధనలను అమలులోకి తెస్తోంది.