రూ.7 వేలకే రియల్ మీ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లతో..?

మనలో చాలామంది తక్కువ ఖర్చుతో మంచి స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయాలని అనుకుంటూ ఉంటారు. తక్కువ బడ్జెట్ తో స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వాళ్లకు రియల్ మీ సంస్థ అదిరిపోయే శుభవార్త చెప్పింది. కేవలం 7వేల రూపాయలకే స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తెచ్చింది. గతేడాది రియల్ మీ సంస్థ రియల్ మీ సీ11ను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఆ మొబైల్ కు కొనసాగింపుగా రియల్ మీ సంస్థ రియల్ మీ సీ11 (2021)ను […]

Written By: Kusuma Aggunna, Updated On : June 27, 2021 6:16 pm
Follow us on

మనలో చాలామంది తక్కువ ఖర్చుతో మంచి స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయాలని అనుకుంటూ ఉంటారు. తక్కువ బడ్జెట్ తో స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వాళ్లకు రియల్ మీ సంస్థ అదిరిపోయే శుభవార్త చెప్పింది. కేవలం 7వేల రూపాయలకే స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తెచ్చింది. గతేడాది రియల్ మీ సంస్థ రియల్ మీ సీ11ను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఆ మొబైల్ కు కొనసాగింపుగా రియల్ మీ సంస్థ రియల్ మీ సీ11 (2021)ను విడుదల చేసింది.

ప్రస్తుతం అందుబాటులోకి తెచ్చిన ఫోన్ సింగిల్ కెమెరాను కలిగి ఉంది. 2జీబీ ర్యామ్, 32జీబీ మెమొరీతో మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చిన ఈ మొబైల్ ధర 6,999 రూపాయలుగా ఉంది. ఈ ఫోన్ ను కొనుగోలు చేయలని భావించే వాళ్లు రియల్ మీ.కామ్ వెబ్ సైట్ ద్వారా ఈ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు. గతేడాది విడుదల చేసిన మోడల్ ధర మాత్రం 7,499 రూపాయలుగా ఉంది. ఆండ్రాయిడ్ 11తో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది.

రియల్ మీ 2.0తో పని చేయడం ఈ ఫోన్ యొక్క ప్రత్యేకత. ఆక్టాకోర్ ప్రాసెసర్ ను కలిగి ఉన్న ఈ ఫోన్ 6.5 అంగుళాల హెచ్డీ + డిస్ ప్లేను కలిగి ఉంది. ముందువైపు 5 ఎంపీ కెమెరా ఉండగ వెనుక వైపు 8 ఎంపీ కెమెరా ఉంది. ఇంటర్నల్ స్టోరేజ్ 256 జీబీ వరకు పెంచుకునే వీలు ఉందని తెలుస్తోంది. ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో అందుబాటులోకి రానుంది. రివర్స్ ఛార్జింగ్ సదుపాయాన్ని కూడా ఈ ఫోన్ కలిగి ఉంది.

ఓటీజీ కేబుల్ సహాయంతో ఈ ఫీచర్ ను వినియోగించుకోవడం సాధ్యమవుతుంది. తక్కువ ఖర్చుతో స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయడం మంచిదని చెప్పవచ్చు. రియల్ మీ ఫోన్ బడ్జెట్ తో పోలిస్తే అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది.