https://oktelugu.com/

థ్యాంక్ యూ బ్రదర్’ ట్రైలర్ టాక్: లిఫ్ట్ లో ఇరుక్కున్న అనసూయ

విలక్షణ మైన పాత్రలు,, విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ స్టార్ యాంకర్ అనసూయ ముందుకు సాగుతున్నారు. ఈ కరోనా లాక్ డౌన్ కాలంలోనూ ఆమె ఒక కొత్త చిత్రంతో మన ముందుకు వచ్చారు. యాంకర్ అనసూయ, అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజాగా చిత్రం ‘థ్యాంక్ యూ బ్రదర్’ ట్రైలర్ ను హీరో వెంకటేశ్ ఆవిష్కరించారు. కొత్త దర్శకుడు రమేశ్ రాపర్తి ఈ చిత్రాన్ని రూపొందించారు. జస్ట్ ఆర్డినరీ పతాకంపై మాగుంట శరత్ చంద్రారెడ్డి -తారక్ […]

Written By:
  • NARESH
  • , Updated On : January 28, 2021 / 08:58 PM IST
    Follow us on

    విలక్షణ మైన పాత్రలు,, విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ స్టార్ యాంకర్ అనసూయ ముందుకు సాగుతున్నారు. ఈ కరోనా లాక్ డౌన్ కాలంలోనూ ఆమె ఒక కొత్త చిత్రంతో మన ముందుకు వచ్చారు.

    యాంకర్ అనసూయ, అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజాగా చిత్రం ‘థ్యాంక్ యూ బ్రదర్’ ట్రైలర్ ను హీరో వెంకటేశ్ ఆవిష్కరించారు. కొత్త దర్శకుడు రమేశ్ రాపర్తి ఈ చిత్రాన్ని రూపొందించారు. జస్ట్ ఆర్డినరీ పతాకంపై మాగుంట శరత్ చంద్రారెడ్డి -తారక్ నాథ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

    తాజాగా ట్రైలర్ ఆసక్తి రేపింది. ఒక బాధ్యతలేని పోకిరీ కుర్రాడు, ఒక నిండు గర్భిణి అయిన అనసూయ ఒక లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన వైనాన్ని ప్రధాన కథగా తీసుకున్నారు. షార్ట్స్ సర్క్యూట్ తో లిఫ్ట్ మొత్తం ఎటూ కదిలినా షాక్ తగులుతుండడం.. అదే సమయంలో నొప్పులు మొదలై అనసూయ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడం.. బాధ్యతలేని ఆ పోకిరీ కుర్రాడు ఏం చేశాడు? ఈ గండం నుంచి వారిద్దరూ ఎలా బయటపడ్డారన్నది ప్రధాన కథ.

    సినిమా ట్రైలర్ చూస్తే ఆసక్తి రేపేలానే ఉంది. ‘థ్యాంక్యూ బ్రదర్’ విభిన్నమైన కాన్సెప్ట్ తో ఉత్కంఠగా మలిచినట్టు తెలుస్తోంది. అనసూయ ఇందులో లీడ్ రోల్ పోషించడంతో ఆసక్తి రేపుతోంది.