https://oktelugu.com/

అయోధ్య మసీదులో నమాజ్ చేసినా పాపమే.. అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

అయోధ్యలోని బాబ్రీ మసీదును కూల్చి దాని స్థానంలో కొత్తగా కొడుతున్న బాబ్రీ మసీదులో ముస్లింలు ఎవరూ నమాజ్ చేయవద్దని.. అందులో నమాజ్ చేసినా పాపమే అంటూ ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో ఐదు ఎకరాల భూమి తీసుకొని కట్టబోతున్న మసీదుకు చందాలు ఇవ్వడం కూడా తప్పు అని ముస్లింలకు పిలుపునిచ్చారు. అయోధ్యలో కట్టబోయే మసీదులో నమాజు చేయవద్దని ఇప్పటికే మత పెద్దలు కూడా చెబుతున్నారని అసదుద్దీన్ అన్నారు. ఎవరికైతే […]

Written By:
  • NARESH
  • , Updated On : January 29, 2021 / 08:58 AM IST
    Follow us on

    అయోధ్యలోని బాబ్రీ మసీదును కూల్చి దాని స్థానంలో కొత్తగా కొడుతున్న బాబ్రీ మసీదులో ముస్లింలు ఎవరూ నమాజ్ చేయవద్దని.. అందులో నమాజ్ చేసినా పాపమే అంటూ ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో ఐదు ఎకరాల భూమి తీసుకొని కట్టబోతున్న మసీదుకు చందాలు ఇవ్వడం కూడా తప్పు అని ముస్లింలకు పిలుపునిచ్చారు.

    అయోధ్యలో కట్టబోయే మసీదులో నమాజు చేయవద్దని ఇప్పటికే మత పెద్దలు కూడా చెబుతున్నారని అసదుద్దీన్ అన్నారు. ఎవరికైతే బాబ్రీ మసీదు స్థలంలో ఐదెకరాల్లో తన పేరు కట్టాలనుకుంటున్న ఆ మసీదును అనైతికమని రహ్మతుల్లా బతికుంటే చెప్పేవారని అసద్ ఆడిపోసుకున్నారు.

    మతపెద్దలు, ప్రబోధకులు, పర్సనల్ లా బోర్డు.. ఎవరిని అడిగినా వారు చెప్పేది ఒకటేనని.. కూలగొట్టిన చోట 5 ఎకరాల్లో కడుతున్న మసీదులో నమాజ్ చదవడం పాపమని.. దానికోసం డబ్బు ఇవ్వడం కూడా తప్పేనని అసదుద్దీన్ విద్వేశాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.

    ధనవంతులు డబ్బే ఇవ్వాలనుకుంటే నిరుపేద అమ్మాయిల వివాహానికి సాయం చేయండని.. నిస్సహాయులకు దానమివ్వండని.. అలాంటి వారిని ఆదుకోండని అసద్ పిలుపునిచ్చారు.అంతేకానీ అయోధ్య మసీదుకు మాత్రం నయాపైసా ఇవ్వొద్దు అంటూ అసదుద్దీన్ సంచలన కామెంట్స్ చేశారు.

    ఇక ముస్లింలు ఎవరూ దళితులతో పోటీ పడొద్దని అసదుద్దీన్ పిలుపునిచ్చారు. తాను అంబేద్కర్ అభిమానన్న అసద్.. గాడ్సే ఫ్యాన్స్ దేశంలో అల్లర్లు కూడా సృష్టించగలరని బీజేపీపై పరోక్షంగా ఘాటు విమర్శలు చేశారు. దేశంలో శాంతిని కోరుకునే వారిని యాంటీ నేషనల్స్ పేరుతో జైలుకు పంపిస్తున్నారని అసద్ ఆరోపించారు.