చలికాలంలో డ్రై స్కిన్ సమస్యకు చెక్ పెట్టే చిట్కాలివే..?

సాధారణంగా చలికాలంలో చాలామందిని డ్రై స్కిన్ సమస్య వేధిస్తూ ఉంటుంది. వయస్సుతో సంబంధం లేకుండా ఈ సమస్యతో ఎంతోమంది బాధ పడుతూ ఉంటారు. మాయిశ్చరైజర్లను ఉపయోగించినా పెద్దగా ఫలితం ఉండదు. అయితే కొన్ని చిట్కాలను పాటించడం వల్ల చలికాలంలో సులభంగా డ్రై స్కిన్ సమస్యకు చెక్ పెట్టవచ్చు. కఠినమైన పొడి, తడి గాలుల వల్ల చర్మం పొడి బారుతుంది. డ్రై స్కిన్ ను నిర్లక్ష్యం చేస్తే ఇతర చర్మ సమస్యలు కూడా వేధించే అవకాశం ఉంటుంది. క్రీమ్ […]

Written By: Kusuma Aggunna, Updated On : November 20, 2020 9:49 am
Follow us on


సాధారణంగా చలికాలంలో చాలామందిని డ్రై స్కిన్ సమస్య వేధిస్తూ ఉంటుంది. వయస్సుతో సంబంధం లేకుండా ఈ సమస్యతో ఎంతోమంది బాధ పడుతూ ఉంటారు. మాయిశ్చరైజర్లను ఉపయోగించినా పెద్దగా ఫలితం ఉండదు. అయితే కొన్ని చిట్కాలను పాటించడం వల్ల చలికాలంలో సులభంగా డ్రై స్కిన్ సమస్యకు చెక్ పెట్టవచ్చు. కఠినమైన పొడి, తడి గాలుల వల్ల చర్మం పొడి బారుతుంది. డ్రై స్కిన్ ను నిర్లక్ష్యం చేస్తే ఇతర చర్మ సమస్యలు కూడా వేధించే అవకాశం ఉంటుంది.

క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ ను రాసుకుంటే ఆ క్రీమ్స్ రంధ్రాలను మూసివేసి మొటిమలకు కారణమవుతాయి. అలోవెరా జెల్ తక్కువ సమయంలో పొడి చర్మం సమస్యకు చెక్ పెడుతుంది. ఈ జెల్ లో ఉండే యాసిడ్స్ డెడ్ స్కిన్ సెల్స్ ను నాశనం చేస్తాయి. ఈ జెల్ ను ముఖానికి పట్టించినా మంచి ఫలితాలు ఉంటాయి. సాధారణంగా చలికాలంలో దాహం అనిపించదు. అయితే ప్రతిరోజూ తగినంత నీటిని తీసుకోవడం వల్ల కూడా డ్రై స్కిన్ సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చు.

మాయిశ్చరైజర్ ను తప్పనిసరిగా వాడాలని అనుకుంటే ఆయిల్ బేస్ గా ఉండే మాయిశ్చరైజర్ ను ఎంపిక చేసుకుంటే మంచిది. చలికాలంలో ఇంట్లో హ్యుమిడిఫైయర్ ని ఇన్ స్టాల్ చేసుకుంటే మంచిది. తరచూ కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవడం ద్వారా కూడా పొడిచర్మం సమస్యకు చెక్ పెట్టవచ్చు. వీలైనంత వరకు కెమికల్ సోప్స్ కు దూరంగా ఉండటం మంచిది. తరచూ గోరువెచ్చని నీరు తాగినా డ్రై స్కిన్ సమస్యకు చెక్ పెట్టవచ్చు.

దానిమ్మపండ్లు ఎక్కువగా తిన్నా, దానిమ్మ జ్యూస్ తాగినా మంచి ఫలితాలు ఉంటాయి. పొడిబారిన చర్మానికి కీరదోస ముక్కలను అప్లై చేసి రుద్దినా మెరుగైన ఫలితాలు ఉంటాయి. మాయిశ్చరైజింగ్ గుణాలు ఎక్కువగా ఉన్న వేపనూనె స్కిన్ ను డ్రైగా మార్చడంతో పాటు చర్మానికి పోషణను అందిస్తుంది.