https://oktelugu.com/

జర్నలిస్టులకు.. కేసీఆర్ మళ్లీ వేసేశాడు..

ఇదుగో పండు.. అదుగో కాయ.. అనే విధంగా సీఎం కేసీఆర్ జర్నలిస్టులకు ఆశ చూపుతూ చివరికి చిప్ప చేతిలో పెడుతున్నాడు. జర్నలిస్టులకు అరచేతిలో స్వర్గం చూపిస్తున్నాడు. పాపం అమాయకులైన జర్నలిస్టులు తృణమో.. ప్రణమో వస్తుందని కేసీఆర్ చెప్పే కాకమ్మ హామీలను గుడ్డిగా నమ్మి మోసపోతున్నారు. మళ్లీ ఎన్నికలొచ్చేవరకు సారూ కనిపించకపోయేసరికి నెత్తిన తడి గుడ్డ వేసుకొని లబోదిబోమంటున్నారు. ఎన్నికలొచ్చిన ప్రతీసారి కేసీఆర్ కు జర్నలిస్టులు గుర్తుకు వస్తారు. ఆ తరువాత మాట మాట్లడనీయడు.. ఒకేసారి ఎత్తుకుంటాడు.. ఆ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 20, 2020 10:06 am
    Follow us on

    KCR, Journalists

    ఇదుగో పండు.. అదుగో కాయ.. అనే విధంగా సీఎం కేసీఆర్ జర్నలిస్టులకు ఆశ చూపుతూ చివరికి చిప్ప చేతిలో పెడుతున్నాడు. జర్నలిస్టులకు అరచేతిలో స్వర్గం చూపిస్తున్నాడు. పాపం అమాయకులైన జర్నలిస్టులు తృణమో.. ప్రణమో వస్తుందని కేసీఆర్ చెప్పే కాకమ్మ హామీలను గుడ్డిగా నమ్మి మోసపోతున్నారు. మళ్లీ ఎన్నికలొచ్చేవరకు సారూ కనిపించకపోయేసరికి నెత్తిన తడి గుడ్డ వేసుకొని లబోదిబోమంటున్నారు. ఎన్నికలొచ్చిన ప్రతీసారి కేసీఆర్ కు జర్నలిస్టులు గుర్తుకు వస్తారు. ఆ తరువాత మాట మాట్లడనీయడు.. ఒకేసారి ఎత్తుకుంటాడు.. ఆ తరువాత తొక్కేస్తాడు.. ఇప్పుడీ ఆవేదన ఎందుకంటే హైదరాబాద్ లో గ్రేటర్ ఎన్నికలు ఉన్నాయి కదా..కేసీఆర్ కు మళ్లీ జర్నలిస్టులు గుర్తుకొచ్చారు.. ఇంతకీ ఇప్పడేమంటున్నాడంటే..

    Also Read: ఒవైసీ సెక్యులరిజాన్ని గురించి తెలుసుకుందాం

    టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నుంచి జర్నలిస్టులు ఇక బాగుపడ్డట్లే అనుకున్నారు. పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లూ పనిచేస్తున్న విలేకరులకు వార్త కవరేజీ విషయంలో ముందున్నా జేబుకు వచ్చేది మాత్రం ఏమీ ఉండదు.. ఈ సమయంలో ప్రభుత్వ సాయం కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఇళ్ల స్థలాలు, ఇళ్ల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.

    అంతకుముందు ప్రభుత్వాలు ఇదిగో.. అదుగో.. అంటూ కాలం గడిపేశాయి. ఇక తెలంగాణ ఏర్పడిన తరువాతనైనా తమ జీవితాలు బాగుపడుతాయని అనుకొన్నారు. కుటుంబాలను వదిలి తెలంగాణ పోరాటంలో ముందున్నారు. అయితే తెలంగాణ పోరాటం నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి ఆరేళ్లవుతున్నా సీఎం కేసీఆర్ ఒకే పాట పాడుతున్నారు ‘జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలిస్తాం’ అని.

    Also Read: బీజేపీకి అంత సీన్‌ ఉందా..!

    ఇటీవల  దుబ్బాక ఎన్నికల సమయంలోనే కేసీఆర్ ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలివ్వడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అయితే కోర్టులో కేసు నడుస్తోందని చెప్పారు. కానీ కేసీఆర్ తలుచుకుంటే ఆ కేసు పెద్ద విషయం కాదు. కానీ ఆ పని చేసేలా కనిపించడం లేదు.

    ఇప్పడు హైదరాబాద్ లో గ్రేటర్ ఎన్నికలు వచ్చిన సందర్భంగా మళ్లీ జర్నలిస్టుల పోటెత్తారు. జర్నలిస్టులకు త్వరలో ఇళ్ల స్థలాలిస్తామని, కోర్టు కేసు కూడా పరిష్కరిస్తామంటున్నారు.   అయితే వ్యక్తిగతంగా రిపోర్టరుకేసీఆర్ కు వ్యతిరేకమైనా జర్నలిస్టు సంఘాలు మాత్రం కేసీఆర్ కు మద్దత ఇస్తున్నాయి. దీంతో ఆ సమస్య అక్కడి మిగిలిపోతుంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్