ఒలంపిక్స్ లో నారిభేరి: అతివలదే సత్తా

135 కోట్ల మంది భారతీయులున్నారు.. ఇంతమంది ఉన్నా ప్రపంచ ప్రఖ్యాత క్రీడాసంబురం ఒలింపిక్స్ లో భారత్ కు పతకాలు తెచ్చింది మాత్రం మన అతివలే కావడం విశేషం. గడిచిన కొన్నేళ్లుగా భారత్ కు ఒలింపిక్స్ లో పతకాలు ఐదు వచ్చాయి. ఆ ఐదు కూడా మన మహిళా క్రీడాకారులే తేవడం విశేషం అని చెప్పొచ్చు. అతివలే మన కీర్తి పతకాన్ని ప్రపంచ క్రీడా పండుగలో చాటిచెప్పారు. . ఒలంపిక్స్ లో తాజాగా భారత్ కు వరుసగా రెండో […]

Written By: NARESH, Updated On : August 2, 2021 10:44 am
Follow us on

135 కోట్ల మంది భారతీయులున్నారు.. ఇంతమంది ఉన్నా ప్రపంచ ప్రఖ్యాత క్రీడాసంబురం ఒలింపిక్స్ లో భారత్ కు పతకాలు తెచ్చింది మాత్రం మన అతివలే కావడం విశేషం. గడిచిన కొన్నేళ్లుగా భారత్ కు ఒలింపిక్స్ లో పతకాలు ఐదు వచ్చాయి. ఆ ఐదు కూడా మన మహిళా క్రీడాకారులే తేవడం విశేషం అని చెప్పొచ్చు. అతివలే మన కీర్తి పతకాన్ని ప్రపంచ క్రీడా పండుగలో చాటిచెప్పారు. .

ఒలంపిక్స్ లో తాజాగా భారత్ కు వరుసగా రెండో పతకాన్ని పీవీ సింధు అందించింది. 2016 రియో ఒలింపిక్స్ లో రజతం గెలిచిన సింధు.. టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం సాధించింది. టోక్యో ఒలింపిక్స్ సింగిల్స్ బ్యాడ్మింటన్ లో భాగంగా మూడో స్థానం కోసం చైనా క్రీడాకారిణి బింగ్ జియావో తో జరిగిన పోరులో సింధు చెలరేగిపోయింది. భారీ అంచనాల నడమ ఒలింపిక్స్ కు వెళ్లిన సింధూ దాన్ని సాకారం చేసుకుంటూ భారత్ కు పతకం అందించి త్రివర్ణ పతకాన్ని అంతర్జాతీయ వేదికపై మరోసారి రెపరెపలాడించింది.

తాజా పోరులో పీవీ సింధు 21-13,21-15 తేడాతో బింగ్ జియావోపై గెలిచింది. 2016లో రియోలో జరిగిన ఒలింపిక్స్ లో రజతం సాధించిన సింధూ తాజా ఒలింపిక్స్ లో కూడా పతకం సాధించి భారత అభిమానులు పెట్టుకున్న ఆశలను నిలబెట్టింది.

ఒలింపిక్స్ చరిత్రలోనే రెండు పతకాలు సాధించిన ఏకైక భారత క్రీడాకారిణిగా సింధు కొత్త అధ్యాయం లిఖించింది. స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించేకపోవడమే సింధుకు చేదు అనుభవంగా ఉంది. కాంస్యం గెలిచి ఆలోటును కాస్తంత పూరించింది. భారతీయులను ఉప్పొంగేలా చేసింది.

ఒలింపిక్స్ లో ఇప్పటివరకు రెజ్లర్ సుశీల్ కుమార్ మాత్రమే రెండు పతకాలు గెలుపొందాడు.. 2008లో జరిగిన బీజింగ్ ఒలింపిక్స్ లో కాంస్య పతకం గెలుపొందిన సుశీల్ కుమార్.. 2012లో జరిగిన లండన్ ఒలింపిక్స్ లో రజత పతకాన్ని భారత్ కు అందించాడు. అప్పటి నుంచి ఇప్పటివరకూ భారత క్రీడాకారులు ఎవరూ ఈ రికార్డ్ కు చేరువకాలేదు. కానీ తాజాగా పీవీ సింధూ బ్యాక్ టు బ్యాక్ పతకాలతో సుశీల్ కుమార్ సరసన చేరారు.

గత 2016లో కూడా మహిళలే భారత్ కు రెండు పతకాలను లండన్ ఒలింపిక్స్ లో తెచ్చిపెట్టారు. ఇదే బ్యాడ్మింటన్ తార పీవీ సింధు ఫైనల్ లో ఓడిపోయి సిల్వర్ మెడల్ సాధించగా.. రెజ్లింగ్ లో సాక్షి మాలిక కు కాంస్య పతకం దక్కింది.

ఇక 2021లో తాజాగా ఒలింపిక్స్ లో మీరాబాయి చాను బాక్సింగ్ లో పతకం సాధించింది. ఇప్పుడు పీవీ సింధు.. ఈ లెక్కన గడిచిన రెండు ఒలింపిక్స్ లో మన అమ్మాయిలే భారత్ కు పతకాలు అందించారు. అబ్బాయిలు ఆ ఘనత సాధించలేకపోవడం గమనార్హం.

ఇక అంతకుముందు 2000 సంవత్సరంలో మన ఏపీ ఆడకూతురు కరణం మల్లీశ్వరి వెయిట్ లిఫ్టింగ్ లో కాంస్యం గెలిచింది. ఇక 2012లో బ్యాడ్మింటన్ లో సైనా నెహ్వాల్ కాంస్యం గెలిచింది. ఇక ఇదే 2012లో మేరికోమ్ బాక్సింగ్ లో కాంస్య పతకం సాధించింది.

ఇలా భారత చరిత్రలో కరణం మల్లీశ్వరి, సైనా నెహ్వాల్, మేరికోమ్, పీవీ సింధు, సాక్షి మాలిక్, మీరాభాయి చాను, లవ్లోని బార్గోనిలు ఒలింపిక్స్ పతకాలు గెలిచి భారత నారీలే ఈ ఘనత సాధించి దేశ పతాకాన్ని రెపరెపలాడించారు.