కేసీఆర్‌‌ వెనక్కి తగ్గినట్లేనా?

టీఆర్‌‌ఎస్‌ పార్టీకి గ్రాఫ్‌ ఎలా ఉన్నా.. కేసీఆర్‌‌ ఒక్కసారి ప్రచారంలోకి దిగారంటే ఆ గ్రాఫ్‌ కాస్త యూటర్న్‌ తీసుకోవాల్సిందే. ఆయన స్పీచ్‌ అలా ఉంటుంది మరి. ప్రజలను ఎలా ఆకట్టుకోవాల్నో.. వారి నుంచి ఎలా ఓట్లు రాబట్టాలో తెలిసిన నేత ఆయన. తెలంగాణ వచ్చి ఆరేండ్లు గడుస్తున్నా.. ఇన్నాళ్లు జరిగిన ఎన్నికల్లో ఆయన చేసిన మంత్రాంగం అదే. అయితే.. ఈ మధ్య టీఆర్‌‌ఎస్‌ పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. అందుకే.. ఈ […]

Written By: NARESH, Updated On : November 26, 2020 10:22 am
Follow us on

టీఆర్‌‌ఎస్‌ పార్టీకి గ్రాఫ్‌ ఎలా ఉన్నా.. కేసీఆర్‌‌ ఒక్కసారి ప్రచారంలోకి దిగారంటే ఆ గ్రాఫ్‌ కాస్త యూటర్న్‌ తీసుకోవాల్సిందే. ఆయన స్పీచ్‌ అలా ఉంటుంది మరి. ప్రజలను ఎలా ఆకట్టుకోవాల్నో.. వారి నుంచి ఎలా ఓట్లు రాబట్టాలో తెలిసిన నేత ఆయన. తెలంగాణ వచ్చి ఆరేండ్లు గడుస్తున్నా.. ఇన్నాళ్లు జరిగిన ఎన్నికల్లో ఆయన చేసిన మంత్రాంగం అదే. అయితే.. ఈ మధ్య టీఆర్‌‌ఎస్‌ పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. అందుకే.. ఈ మధ్య జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్‌‌ఎస్‌ ఫస్ట్‌ టైమ్‌ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

Also Read: తిరుపతి ఉపఎన్నిక: అగమ్యగోచరంగా పవన్‌ కళ్యాణ్ పరిస్థితి

అయితే.. ప్రస్తుత గ్రేటర్‌‌ ఎన్నికల సీజన్‌ నడుస్తోంది. దుబ్బాక ఎన్నికలో ఓటమితో బీజేపీకి మరోమారు ఛాన్స్‌ ఇవ్వకుండా కేవలం 20 రోజుల్లోనే ఎన్నికలు వచ్చేలా ప్లాన్‌ చేశారు కేసీఆర్‌‌. నోటిఫికేషన్‌ లేకుండానే ఏకంగా షెడ్యూల్‌ను రిలీజ్‌ చేయించారు. ఇక ఇప్పుడు బీజేపీ, టీఆర్‌‌ఎస్‌ల ప్రచారం నువ్వా నేనా అన్నట్లుగా నడుస్తోంది. ఇప్పటికే ప్రచారంలో ఉన్న పలువురు టీఆర్‌‌ఎస్‌ మంత్రులను, లీడర్లను ప్రజలు నిలదీస్తున్న ఘటనలు కూడా చూస్తున్నాం.

గ్రేటర్‌‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివర రోజు నగరంలోని ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలనుకుంది. కేసీఆర్‌తో ప్రచారం చేయించాలనుకుంది. కానీ.. ఇప్పుడు ఆ ప్రచార సభ లేనట్లుగా తెలుస్తోంది. అందుకే.. టీఆర్ఎస్ నేతలు కూడా ఈ సభ గురించి ఎక్కడా మాట్లాడడం లేదు. ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు కూడా ప్రారంభం కాలేదు. దీంతో ఆ ప్రచారసభ జరుగుతుందా లేదా అన్నదానిపై స్పష్టత లేకుండా పోయింది. కేసీఆర్ స్వయంగా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఆ సందర్భంగా గంటకుపైగా మాట్లాడారు. చెప్పాల్సినదంతా చెప్పారు.

Also Read: కేసీఆర్ కు స్వామిగౌడ్ ఇలా షాకిస్తాడనుకోలేదు!

టీఆర్‌‌ఎస్‌లో కూడా మొన్నటి వరకు ఉన్న ధీమా ఇప్పుడు కనిపించడం లేదు. మొన్నటివరకు ఏకపక్షంగా వంద సీట్లు గెలుస్తామని చెప్పిన నేతలంతా.. ఇప్పుడు మేయర్‌‌ పీఠం తమదేనని మాత్రమే మాట్లాడుతున్నారు. ఎంఐఎం మద్దతు.. ఎక్స్ అఫీషియో ఓట్ల మద్దతుతో మేయర్ పీఠం దక్కించుకోవచ్చేమో కానీ.. ఓడిపోయారన్న ప్రచారం మాత్రం జరుగుతుంది. మేయర్‌‌ పీఠం దక్కాలంటే 76 కార్పొరేటర్ సీట్లను గెలుచుకోవాల్సిందే. అయితే పరిస్థితి అంత సులువుగా లేదు. ఓ వైపు వరద బాధితులకు సాయం అందకపోవడానికి తోడు ఎల్ఆర్ఎస్ లాంటి ప్రభుత్వ నిర్ణయాలు.. ప్రజల్ని ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. వాటన్నింటినీ కవర్ చేయడానికి ముఖ్యమంత్రి ప్రచారం చేయాల్సిందేనన్న అభిప్రాయం టీఆర్ఎస్ క్యాడర్‌లో ఉంది. అంతేకాదు.. దుబ్బాక ఫలితం రిపీట్‌ కాకుండా ఉండాలంటే బాస్‌ బయటకు రావాలనే కోరుతున్నారట.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్