https://oktelugu.com/

అప్పుల బాధలు తొలగిపోవాలంటే శుక్రవారం ఈ దీపం వెలిగించాలి!

సాధారణంగా ప్రతి ఒక్కరు ఎన్నో సమస్యలతో సతమతమవుతుంటారు. అంతేకాకుండా మరికొందరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని తీవ్రమైన అప్పులతో బాధపడుతుంటారు.అలాంటి వారికి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అప్పుల తీరిపోవాలంటే శుక్రవారం అమ్మవారిని ప్రత్యేకం పూజించాలి. అలా పూజించడం ద్వారా అమ్మవారి అనుగ్రహం కలిగి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అంతే కాకుండా మన ఇంట్లో ఐశ్వర్యం కలగాలంటే శుక్రవారం పూట కచ్చితంగా ఐశ్వర్య దీపం వెలిగించాలి. అయితే ఐశ్వర్య దీపం ఎలా వెలిగిస్తారో ఇక్కడ తెలుసుకుందాం… Also Read: […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 11, 2020 / 09:44 AM IST
    Follow us on

    సాధారణంగా ప్రతి ఒక్కరు ఎన్నో సమస్యలతో సతమతమవుతుంటారు. అంతేకాకుండా మరికొందరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని తీవ్రమైన అప్పులతో బాధపడుతుంటారు.అలాంటి వారికి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అప్పుల తీరిపోవాలంటే శుక్రవారం అమ్మవారిని ప్రత్యేకం పూజించాలి. అలా పూజించడం ద్వారా అమ్మవారి అనుగ్రహం కలిగి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అంతే కాకుండా మన ఇంట్లో ఐశ్వర్యం కలగాలంటే శుక్రవారం పూట కచ్చితంగా ఐశ్వర్య దీపం వెలిగించాలి. అయితే ఐశ్వర్య దీపం ఎలా వెలిగిస్తారో ఇక్కడ తెలుసుకుందాం…

    Also Read: టేక్ హోం శాలరీలో కోత విధిస్తే ఉద్యోగులకు లాభమా…? నష్టమా..?

    శ్రీ మహాలక్ష్మి మన ఇంట్లో కొలువై ఉండాలంటే శుక్రవారం మన ఇంట్లో సూర్యాస్తమయం, సూర్యోదయం తర్వాత ఐశ్వర్య దీపం వెలిగించాలి. ఐశ్వర్య దీపం వెలిగించడానికి 2 ఇత్తడి ప్లేట్లు, ప్రమిదలు, అక్షింతలు, పువ్వులు, బెల్లం సిద్ధంగా ఉంచుకోవాలి. శుక్రవారం ఉదయం మన ఇంటిని శుభ్రం చేసుకుని స్నానం ఆచరించి పూజ గదిలో లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా ఫోటోను ఉంచుకొని ప్రత్యేక అలంకరణ చేయాలి. తరువాత బియ్యపు పిండితో పద్మం ముగ్గు వేయాలి.

    Also Read: భారీగా తగ్గిన గుడ్ల ధరలు.. ఒక గుడ్డు ఎంతంటే..?

    ఆ పద్మం పై ఇత్తడి ప్లేట్ ను ఉంచి అందులో రాళ్ల ఉప్పు వేయాలి. తరువాత ఉప్పుపై అక్షింతలు వేసి మరొక ప్రమిదను ఉంచి నెయ్యితో దీపారాధన చేయాలి. అనంతరం ఆ ప్రమిద చుట్టూ పువ్వులతో అలంకరణ చేయాలి. తరువాత అమ్మవారికి బెల్లంతో తయారుచేసిన తీపి వంటకం నైవేద్యంగా సమర్పించాలి. ఈ విధంగా ఐశ్వర్య దీపాన్ని శుక్రవారం వెలిగించి, ఆదివారం వరకు ఆ దీపం వెలుగుతూ ఉండేలా చూసుకోవాలి. తరువాత ఆ ఉప్పును ఏదైనా నీటి కాలువలు, లేదా బావిలో వేయాలి. ఈ విధంగా ఐశ్వర్య దీపం వెలిగించడం ద్వారా సాక్షాత్తు ఆ మహాలక్ష్మి ఇంట్లో కొలువై అష్టైశ్వర్యాలను కలిగిస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం