
మూడు నెలలుగా నిలిచిపోయిన వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు నేటినుంచి ప్రారంభం కానున్నాయి. రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో హైకోర్టు ప్రభుత్వాన్ని త్వరగా ప్రారంభించాలని ఆదేశించింది. నేటి నుంచి తెలంగాణలో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు ప్రారంభించడానికి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్‌సైట్ ద్వారా స్లాట్ బుకింగ్‌లు చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈనెల 14 నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభించనున్నారు. అలాగే స్లాట్ బుకింగ్ లేకుండా రిజిస్ట్రేషన్ చేయొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.