https://oktelugu.com/

తొలిరోజే జోబైడెన్ సంచలన నిర్ణయాలివీ..

పోతూ పోతూ చాలా మంది కొంపలు కూల్చే నిర్ణయాలను పాత అధ్యక్షుడు ట్రంప్ తీసుకొని సంతకాలు చేసి అమలయ్యేలా చేశాడు. ఇప్పుడు నిన్న కొత్త అధ్యక్షుడిగా ప్రమాణం చేయగానే జోబైడెన్ తొలిరోజే కీలకమైన 15 కార్యనిర్వాహక ఆదేశాలపై సంతకాలు చేశారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన పలు ఆదేశాలను జోబైడెన్ వెనక్కి తీసుకున్నాడు. Also Read: అమెరికన్ల ఐక్యతే జోబైడెన్ మంత్రం.. ట్రంప్ వివాదాస్పద నిర్ణయాలతో ఇబ్బందులు పడుతున్న అమెరికన్లు, విదేశీయులకు ఊరటనిచ్చేలా.. ప్రజలకు మేలు […]

Written By:
  • NARESH
  • , Updated On : January 21, 2021 / 09:10 AM IST
    Follow us on

    పోతూ పోతూ చాలా మంది కొంపలు కూల్చే నిర్ణయాలను పాత అధ్యక్షుడు ట్రంప్ తీసుకొని సంతకాలు చేసి అమలయ్యేలా చేశాడు. ఇప్పుడు నిన్న కొత్త అధ్యక్షుడిగా ప్రమాణం చేయగానే జోబైడెన్ తొలిరోజే కీలకమైన 15 కార్యనిర్వాహక ఆదేశాలపై సంతకాలు చేశారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన పలు ఆదేశాలను జోబైడెన్ వెనక్కి తీసుకున్నాడు.

    Also Read: అమెరికన్ల ఐక్యతే జోబైడెన్ మంత్రం..

    ట్రంప్ వివాదాస్పద నిర్ణయాలతో ఇబ్బందులు పడుతున్న అమెరికన్లు, విదేశీయులకు ఊరటనిచ్చేలా.. ప్రజలకు మేలు చేసే పలు నిర్ణయాలను జోబైడెన్ తీసుకున్నాడు. అన్నింటికంటే ముఖ్యమైనది కరోనా మహమ్మారి నియంత్రణకు సంబంధించి చర్యలు తీసుకున్నారు. అమెరికన్లు అంతా 100 రోజుల పాటు మాస్కులు ధరించడం.. భౌతిక దూరం పాటించాలని కోరారు. కరోనాపై ‘కోవిడ్19 రెస్పాన్స్ కోఆర్డినేటర్’ పోస్టును సృష్టిస్తూ నిర్ణయం తీసుకున్నరు

    ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్.వో) నుంచి అమెరికా వైదొలుగుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని జోబైడెన్ నిలిపివేశారు. ఇక పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలిగిన ట్రంప్ నిర్ణయాన్ని తొలగించి మళ్లీ చేరుతున్నట్లు జోబైడెన్ సంతకం చేశారు.

    Also Read: అధ్యక్షుడిగా జోబైడెన్ ప్రమాణం.. అమెరికాలో కొత్త చరిత్ర ప్రారంభమైంది..

    ఇక ముస్లిం దేశాలకు రాకపోకలపై ట్రంప్ విధించిన నిషేధాన్ని జోబైడెన్ ఎత్తివేశారు. ఇక మెక్సికో దేశంతో గోడ నిర్మాణం నిమిత్తం నిధుల సేకరణ డిక్లరేషన్ ను నిలిపేశారు.

    భారతీయులకు ఉపశమనం కలిగించేలా.. విదేశీయులకు ఊరటనిచ్చేలా గ్రీన్ కార్డుల జారీపై దేశాలవారీ పరిమితిని నూతన అధ్యక్షుడు జోబైడెన్ ఉపసంహరించారు.

    జాతివివక్ష నిర్మూలన దిశగా.. మత, మైనార్టీ, వర్ణ వివక్ష రూపుమాపేలా సమాన హక్కులను నిర్వచిస్తూ ఉత్తర్వులు జారీ చేసేలా సంతకం చేశారు. ఇక అమెరికాలో నివాసం ఉండేవారికి పౌరసత్వం కల్పించేలా కీలక నిర్ణయం తీసుకున్నారు.

    మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు