అమెరికన్ల ఐక్యతే జోబైడెన్ మంత్రం.. 

అమెరికాలో విద్వేశ ట్రంప్ రాజకీయాలకు తెరపడింది. అమెరికాలో తొలి ఉదయం విశ్వాసంతో మొదలైంది. అమెరికాకు 46వ కొత్త అధ్యక్షుడిగా 78 ఏళ్ల వృద్ధ జోబైడన్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. Also Read: అధ్యక్షుడిగా జోబైడెన్ ప్రమాణం.. అమెరికాలో కొత్త చరిత్ర ప్రారంభమైంది.. తన తొలి ప్రసంగంలోనే జోబైడెన్ అందరినీ ఆకట్టుకున్నారు. అమెరికన్ల ఐక్యతే తన ప్రధాన కర్తవ్యం అని చాటిచెప్పారు. అమెరికాను ఉన్నత స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. […]

Written By: NARESH, Updated On : January 21, 2021 7:05 pm
Follow us on

అమెరికాలో విద్వేశ ట్రంప్ రాజకీయాలకు తెరపడింది. అమెరికాలో తొలి ఉదయం విశ్వాసంతో మొదలైంది. అమెరికాకు 46వ కొత్త అధ్యక్షుడిగా 78 ఏళ్ల వృద్ధ జోబైడన్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.

Also Read: అధ్యక్షుడిగా జోబైడెన్ ప్రమాణం.. అమెరికాలో కొత్త చరిత్ర ప్రారంభమైంది..

తన తొలి ప్రసంగంలోనే జోబైడెన్ అందరినీ ఆకట్టుకున్నారు. అమెరికన్ల ఐక్యతే తన ప్రధాన కర్తవ్యం అని చాటిచెప్పారు. అమెరికాను ఉన్నత స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

అమెరికాలో కొత్త చరిత్ర ప్రారంభమైందని జోబైడెన్ ప్రజల్లో విశ్వాసాన్ని నింపారు. ఇది అమెరికా ప్రజలందరి విజయం అని కొనియాడారు. ముందు ముందు సాధించాల్సి చాలా ఉందని తెలిపారు. కరోనా సంక్షోభ సమయంలో తాను ప్రమాణ స్వీకారం చేయడం చారిత్రాత్మక ఘటం అంటూ కొనియాడారు. ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ప్రమాణం చేయడం అమెరికాకే గర్వకారణం అని పేర్కొన్నారు.

క్యాపిటల్ హిల్ హింసతో అమెరికా ప్రజాస్వామ్యానికి ప్రమాదం వచ్చిందని అందరూ భయపడ్డారని.. ఈరోజు ప్రజాస్వామ్యం గెలిచిందని పరోక్షంగా ట్రంప్ పాలనను దుయ్యబట్టారు.తాను అమెరికన్లందరికీ అధ్యక్షుడిగా ఉంటానంటూ అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా బైడెన్ ప్రసంగం సాగింది.

Also Read: టెంపర్ ట్రంప్.. వైట్ హౌస్ ఖాళీ చేసి పరార్!

అమెరికన్లందరికీ తాను అధ్యక్షుడిగా ఉంటానని జోబైడెన్ హామీ ఇచ్చారు. దేశీయ ఉగ్రవాదంపై తప్పనిసరిగా విజయం సాధిస్తానని.. శ్వేతవర్ణ అహంకారాన్ని ఓడిస్తానని చెప్పారు.

కరోనా వల్ల లక్షల ఉద్యోగాలు పోయాయని.. ఆర్థిక రంగం కుదేలైందని .. కష్టకాలంలో మనం శక్తియుక్తలతో ముందుకు సాగాల్సిన టైం వచ్చిందని బైడెన్ భరోసా కల్పించారు. ఐకమత్యంతో ముందుకు వెళుదామని తెలిపారు.

ఇలా ప్రతి డైలాగును అమెరికన్లందరినీ ఏకం చేసేలా.. వారిలో భరోసా నింపేలా జోబైడెన్ ప్రసంగం సాగింది. సవాళ్లు అధిగమించడంపై కూడా ఆయన కీలక ప్రకటనలు చేశారు.

మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు