https://oktelugu.com/

కి‘లేడి’.. రోజుకు 1లక్ష.. 40రోజులకు 40లక్షలు.. 11.50 కోట్ల దోపిడీ కథ

ఒకటి కాదు.. రెండు కాదు.. ఒక కడప లేడి ఏకంగా ఒక వ్యాపారి నుంచి 11.50 కోట్లు దోపిడీ చేసింది. ట్విస్ట్ ఏంటంటే ఇవన్నీ కూడా విలాసాలకే ఖర్చు చేసింది. ఈమె.. ఈమెతోపాటు ఆమె ప్రియుడు విజయ్ కుమార్ రెడ్డి చాకచక్యంగా తాము తోపులం అంటూ వ్యాపారిని బురిడీ కొట్టించారు. కడప జిల్లాకు చెంది సృతి సిన్హా అలియాస్ శిరీష ఆడిన గేమ్ లో పాపం అనవసరంగా ఆమెతోపాటు ఈ స్కాం చేసిన విజయ్ కుమార్ రెడ్డి […]

Written By:
  • NARESH
  • , Updated On : February 26, 2021 / 03:28 PM IST
    Follow us on

    ఒకటి కాదు.. రెండు కాదు.. ఒక కడప లేడి ఏకంగా ఒక వ్యాపారి నుంచి 11.50 కోట్లు దోపిడీ చేసింది. ట్విస్ట్ ఏంటంటే ఇవన్నీ కూడా విలాసాలకే ఖర్చు చేసింది. ఈమె.. ఈమెతోపాటు ఆమె ప్రియుడు విజయ్ కుమార్ రెడ్డి చాకచక్యంగా తాము తోపులం అంటూ వ్యాపారిని బురిడీ కొట్టించారు.

    కడప జిల్లాకు చెంది సృతి సిన్హా అలియాస్ శిరీష ఆడిన గేమ్ లో పాపం అనవసరంగా ఆమెతోపాటు ఈ స్కాం చేసిన విజయ్ కుమార్ రెడ్డి నిండా మునగగా.. వ్యాపారి వీరారెడ్డి 11.50 కోట్లు లాస్ అయ్యారు.

    శిరీష తనను తాను అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం చైర్ పర్సన్ గా పరిచయం చేసుకుంది. ఈమె సన్నిహితుడు విజయ్ కుమార్ రెడ్డి తాను ఐపీఎస్ అంటూ నాటకమాడారు. ఇద్దరూ కలిసి తాము రిచ్ పీపుల్ అని.. వ్యాపారిని బెదిరించి.. ప్రలోభపెట్టి కోట్లు దండుకున్నారు.

    వీరిద్దరూ కలిసి హైదరాబాద్ లోని ఓ 7 స్టార్ హోటల్ లో రోజుకు 50వేల అద్దె.. 50వేల ఖర్చులు అయ్యే ఖరీదైన రూం తీసుకొని అలా 40 రోజులు 40 లక్షలు ఖర్చు పెట్టారు. ఈ బిల్లును శిరీషనే ఖర్చు పెట్టింది.

    ఇక ఆమె విలాసాలకు కోట్లు తగిలేసింది. 4 నెలలకు ఒక ఖరీదైన కారు కొన్నది.పుట్టిన రోజుకు 30 లక్షలకు తగ్గకుండా బంగారం కొన్నది.. పటాన్ చెరులో విల్లా కొనుగోలు కోసం ఏకంగా 70 లక్షలు అడ్వాన్స్ ఇచ్చింది.

    ఇంత విలాసవంతమైన లైఫ్ చూపించి వీరారెడ్డిని ఈ జంట మోసం చేసి ఏకంగా 11 కోట్ల 50 లక్షలు కొట్టేశారు. ఇందులో ఇప్పటికే 80శాతాన్ని విలాసాలకే ఖర్చు చేశారు. అంతేకాదు.. బంధువులకు అడిగినంత మొత్తాన్ని అప్పుగా కూడా ఇచ్చేయడం విశేషం. వీరారెడ్డి గట్టిగా నిలదీయడంతో విజయ్ కుమార్ రెడ్డి ఇదంతా మోసమని.. శిరీష చేయమంటే చేశానని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో శిరీషను పట్టుకొని విచారించగా పోలీసులు కూడా వినని ఆమె లగ్జరీ లైఫ్ కళ్లముందు కదలాడింది.. పూర్తి వివరాలను పోలీసులు ఈరోజు వెల్లడించబోతున్నట్టు సమాచారం.