https://oktelugu.com/

సురేఖా వాణికి పెళ్లి ప్రపోజల్ పెట్టిన డైరెక్టర్ !

నటి సురేఖా వాణి.. మళ్ళీ పెళ్లి చేసుకోబోతుంది అంటూ వచ్చిన వార్తలు బాగా వైరల్ అయ్యాయి. అయితే, అలాంటిది ఏమిలేదు అని తన పెళ్లి పై సురేఖా క్లారిటీ ఇచ్చింది అనుకోండి. కాకపోతే, ఆమెకు పెళ్లి ప్రపోజల్స్ మాత్రం ఈ మధ్య తరుచుగా వస్తున్నాయట. ఓ ఒంటరి డైరెక్టర్ ఆమెకు పెళ్లి ప్రపోజ్ చేసినట్లు ఫిల్మ్ నగర్ లో టాక్ నడుస్తోంది. ఆ డైరెక్టర్ కి ఇంతవరకూ పెళ్లి కాలేదు, పైగా ఆయన క్యారెక్టర్ కూడా చాలా […]

Written By:
  • admin
  • , Updated On : February 26, 2021 / 03:30 PM IST
    Follow us on


    నటి సురేఖా వాణి.. మళ్ళీ పెళ్లి చేసుకోబోతుంది అంటూ వచ్చిన వార్తలు బాగా వైరల్ అయ్యాయి. అయితే, అలాంటిది ఏమిలేదు అని తన పెళ్లి పై సురేఖా క్లారిటీ ఇచ్చింది అనుకోండి. కాకపోతే, ఆమెకు పెళ్లి ప్రపోజల్స్ మాత్రం ఈ మధ్య తరుచుగా వస్తున్నాయట. ఓ ఒంటరి డైరెక్టర్ ఆమెకు పెళ్లి ప్రపోజ్ చేసినట్లు ఫిల్మ్ నగర్ లో టాక్ నడుస్తోంది. ఆ డైరెక్టర్ కి ఇంతవరకూ పెళ్లి కాలేదు, పైగా ఆయన క్యారెక్టర్ కూడా చాలా మంచింది. అందుకే, సురేఖా వాణిని పెళ్లికి ఒప్పించాలని మిగిలిన ఓ ఇద్దరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు తమ ప్రయత్నాలు మొదలుపెట్టారట. సురేఖా వాణి కుమార్తె కూడా ఈ పెళ్లికి ఇంట్రస్ట్ గా ఉందట.

    Also Read: రివ్యూః అక్ష‌ర‌

    మరి సురేఖా వాణి పెళ్ళికి ఒప్పుకుంటుందా లేదా అనేది చూడాలి. ఏది ఏమైనా సినిమాల్లో అక్క అమ్మ పాత్రలతో పాటు కొన్ని ఎమోషనల్ పాత్రల్లోనూ అంతే స్థాయిలో నటించి ఆ పాత్రలను రక్తి కట్టించే సురేఖా… ఏజ్ అయిపోయినా ఇంకా పర్ఫెక్ట్ ఫిజిక్ ను మెయింటైన్ చేస్తూ.. కొత్త కొత్త లుక్స్ తో సోషల్ మీడియాలో బాగానే పాపులారిటీ సంపాదించింది. కానీ, తెర పై చూసే సురేఖా వాణి వేరు, బయట ఉండే సురేఖా వాణి వేరు అన్నట్టు ఆమె పోస్ట్ చేసే పోస్టులను బట్టి తెలుస్తోంది. ఎదిగిన కూతురు ఉన్నా… ఇంకా యంగ్ అండ్ మోడ్రన్ మదర్‌ లానే తనను తానూ ప్రమోట్ చేసుకుంటూ వస్తోంది.

    Also Read: ‘అర్జున్ రెడ్డి’ నటితో బంధం పై విశాల్ క్లారిటీ !

    ఒక విధంగా సురేఖా వాణి దెబ్బకు కూతురు సుప్రిత కూడా పోటీ పడలేని పరిస్థితి కనిపిస్తోంది. అందుకు తగ్గట్లుగానే తనెత్తు కూతురు ఉన్నా.. సురేఖా వాణి గ్లామర్ అస్సులు తగ్గలేదని నెటిజన్లు కూడా కామెంట్స్ పెడుతున్నారు. కాగా ప్రస్తుతం సురేఖా వాణి రీసెంట్ గా మొదలైన షూటింగ్‌ లతో కాస్త బిజీ అయింది. ఈ క్రమంలోనే సురేఖా వాణి రెండో పెళ్లి పై వార్తలు వచ్చాయి. మరి ఆమె పెళ్లి చేసుకుంటే, ఆ ఒంటరి డైరెక్టర్ కి తోడు దొరుకుతుంది. హీరోయిన్స్ కి పోటీ ఇచ్చేలా రోజురోజుకూ మారిపోతున్న సురేఖా వాణి, ఆ డైరెక్టర్ ని కరుణిస్తోందో లేదో చూడాలి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్