2020 తొలినాళ్లలోనే కరోనా మహమ్మరి చైనాలో వెలుగుచూసింది. ఈ వైరస్ క్రమంగా అన్ని దేశాలకు వ్యాపించడంలో ప్రపంచం వ్యాప్తంగా కరోనా కేసులు నమోదయ్యాయి. భారత్ లోనూ కరోనా కేసులు మార్చిలోనే నమోదయ్యాయి.
కరోనా ఎంట్రీ నేపథ్యంలోనే కేంద్రం అప్రమత్తమై ముందస్తుగా లాక్డౌన్ విధించింది. కొన్నినెలలపాటు దేశంలో లాక్డౌన్ కొనసాగింది. దీంతో ప్రజలంతా ఇబ్బందులు పడటంతో కేంద్రం కరోనా నిబంధనలు విధిస్తూ క్రమంగా ఆన్ లాక్ చేసింది.
ఇప్పుడిప్పుడే దేశంలోని అన్నిరంగాలు కరోనా నుంచి కోలుకుంటున్నాయి. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉంటున్నారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా కొత్త కేసులు నమోదవుతుండటంతో కేంద్రం అప్రమత్తమైంది.
ఈమేరకు నవంబర్ 25న కేంద్రం హోంశాఖ.. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన కోవిడ్-19 నిబంధనల గడువును మరోసారి కేంద్రం పొడగించింది.
జనవరి 31వరకు కొవిడ్ నిబంధనలు అమల్లో ఉంటాయని కేంద్రం హోంశాఖ అన్ని రాష్ట్రాలు.. కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలను జారీ చేసింది.