ధోని అభిమానులకు షాక్.. ఇక అదే చివరి మ్యాచ్..!

మిస్టర్ కూల్ మహేంద్ర ధోని తాజాగా తన రిటైర్మెంట్ ను ప్రకటించిన సంగతి తెల్సిందే. 2019 వరల్డ్ కప్ తర్వాత నుంచి ధోని రిటైర్మెంట్ పై జోరుగా ప్రచారం జరిగింది. అయితే ధోని ఈ వార్తలపై పెద్దగా స్పందించలేదు. దీంతో ధోని క్రికెట్లో కొనసాగుతారని అందరూ భావించారు. అయితే సడన్ గా ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ రోజు సాయంత్రం నుంచి తాను అంతర్జాతీయ క్రికెట్ల్ నుంచి విడ్కోలు తీసుకున్నట్లు భావించండి అంటూ తన ఇన్ స్ట్రాగ్రామ్లో […]

Written By: Neelambaram, Updated On : August 17, 2020 2:57 pm
Follow us on

మిస్టర్ కూల్ మహేంద్ర ధోని తాజాగా తన రిటైర్మెంట్ ను ప్రకటించిన సంగతి తెల్సిందే. 2019 వరల్డ్ కప్ తర్వాత నుంచి ధోని రిటైర్మెంట్ పై జోరుగా ప్రచారం జరిగింది. అయితే ధోని ఈ వార్తలపై పెద్దగా స్పందించలేదు. దీంతో ధోని క్రికెట్లో కొనసాగుతారని అందరూ భావించారు. అయితే సడన్ గా ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ రోజు సాయంత్రం నుంచి తాను అంతర్జాతీయ క్రికెట్ల్ నుంచి విడ్కోలు తీసుకున్నట్లు భావించండి అంటూ తన ఇన్ స్ట్రాగ్రామ్లో పోస్టు చేశాడు. కొద్ది నిమిషాల్లో ధోని రిటైర్మెంట్ వార్త సంచలనంగా మారింది.

కరోనా కారణంగా టీ-20 వరల్డ్ కప్ వాయిదా పడటంతో ధోని తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడనే వార్తలు విన్పిస్తున్నాయి. అయితే ధోని ఫేల్ వేర్ మ్యాచ్ ఆడకుండా రిటైర్మెంట్ ప్రకటించడంపై క్రికెట్ అభిమానులు కొంత నిరుత్సాహానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే జార్జండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ధోని రిటైర్మెంట్ వార్తలపై స్పందించారు. ధోనికి ఒక ఫేర్ వేల్ మ్యాచ్ నిర్వహించాలని బీసీసీఐకి లేఖ రాశారు. బీసీసీఐ ఒప్పుకుంటే జార్జండ్ లోనే మ్యాచ్ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన ట్వీటర్లో పోస్టు చేశారు.

జార్జండ్ ముఖ్యమంత్రి సోరెన్ అభ్యర్థనపై ఐపీఎల్ మాజీ ఛైర్మన్ రాజీవ్ శుక్లా తాజాగా స్పందించారు. ధోని కోసం ప్రత్యేకంగా ఎలాంటి మ్యాచ్ నిర్వహింబోమని స్పష్టం చేశారు. ధోని సైతం ఫేర్ వేల్ మ్యాచ్ పై ఎలాంటి ప్రతిపాదన తీసుకు రాలేదని వెల్లడించారు. రానున్న ఐపీఎల్, ఇతర బీజీ షెడ్యూల్ కారణంగా ధోని కోసం ప్రత్యేకంగా మ్యాచ్ నిర్వహించడం సాధ్యంకాదని ఆయన తేల్చిచెప్పారు. దీంతో ధోని వరల్డ్ కప్ లో న్యూజిల్యాండ్ తో ఆడిన మ్యాచే చివరిది కానుంది.

ఈ మ్యాచులో ధోని రనౌట్ అయి కన్నీటితో వెనుదిరిగిన విషయం తెల్సిందే. ఈ మ్యాచులో భారత్ ఓడిపోవడంతో ప్రపంచ కప్ నుంచి భారత్ ఇంటి ముఖం పట్టింది. ఈ ఓటమికి ధోనినే కారణమంటూ పెద్దఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. నాటి నుంచే ధోని రిటైర్మెంట్ పై పెద్దఎత్తున ప్రచారం జరిగింది. కానీ ధోని వీటిపై స్పందించలేదు. భారత కెప్టెన్ గా.. వికట్ కీపర్ గా.. బ్యాట్స్ మెన్ గా ఇండియన్ టీముకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన ధోని చివరి మ్యాచ్ ఓటమితో ముగియడం గమనార్హం.