బీజేపీ కన్నా రాజకీయ జీవితాన్ని ముగించిందా?

కన్నా లక్ష్మీనారాయణ.. ఈ ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు ఇప్పుడు నిండా మునిగిపోయారా? రెంటికి చెడ్డ రేవడిలా అయిపోయారా? కన్నా ఇప్పుడు నిరాశతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయినట్లు తెలిసింది. బీజేపీ ఏపీకి సోము వీర్రాజును రాష్ట్ర అధ్యక్షుడిగా చేసినప్పటి నుంచి కన్నా తీవ్ర నిరాశలో ఉన్నట్లు చెబుతున్నారు. బీజేపీ అధిష్టానం తనను మోసం చేసిందని కన్నా భావిస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. నిజానికి బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ చేయాలని మొదట భావించలేదు.  అసెంబ్లీ […]

Written By: NARESH, Updated On : August 17, 2020 2:57 pm
Follow us on


కన్నా లక్ష్మీనారాయణ.. ఈ ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు ఇప్పుడు నిండా మునిగిపోయారా? రెంటికి చెడ్డ రేవడిలా అయిపోయారా? కన్నా ఇప్పుడు నిరాశతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయినట్లు తెలిసింది. బీజేపీ ఏపీకి సోము వీర్రాజును రాష్ట్ర అధ్యక్షుడిగా చేసినప్పటి నుంచి కన్నా తీవ్ర నిరాశలో ఉన్నట్లు చెబుతున్నారు. బీజేపీ అధిష్టానం తనను మోసం చేసిందని కన్నా భావిస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది.

నిజానికి బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ చేయాలని మొదట భావించలేదు.  అసెంబ్లీ ఎన్నికల ముందర ఆయన వైసీపీలో చేరడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు. వైసీపీ అధిష్టానం కన్నాకు ‘పెదకూరపాడు’ ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ చేసింది. అంతేకాదు.. ఆయన నలుగురు ముఖ్య అనుచరులకు కూడా ముఖ్యమైన నామినేటెడ్ పోస్టులను ఇస్తామని హామీ ఇచ్చింది.

కానీ చివరి నిమిషంలో కన్నా లక్ష్మీనారాయణకు అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నుంచి పిలుపు వచ్చింది. దీంతో వైసీపీలో చేరాలనుకున్న కన్నా తన ప్రణాళికలను మార్చుకొని తిరిగి బీజేపీలో చేరి ఏపీకి అధ్యక్షుడిగా అయ్యాడు.

కన్నా గడిచిన కొన్నేళ్లుగా పార్టీని నిర్మించడానికి చాలానే కష్టపడ్డాడు. నిరంతరం ప్రజల్లోకి వెళ్లి పర్యటించాడు. ఓట్లను సమీకరించడానికి ప్రయత్నించాడు. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పేలవ ప్రదర్శన చేసింది. కన్నా టీడీపీ తరుఫున రాజకీయాలు చేస్తున్నాడనే వైసీపీ ప్రచారం బాగా ప్రజల్లోకి వెళ్లడం బీజేపికి మైనస్ గా మారింది. ఇప్పుడు అదే ఆయన పోస్టును ఊస్ట్ చేసేలా చేసింది.

తాజాగా కన్నా లక్ష్మీనారాయణ తనను కలవడానికి వచ్చిన తన మద్దతుదారులతో ఆవేదన వ్యక్తం చేస్తున్నాడట.. బీజేపీ తనకు మరోసారి ఏపీ అధ్యక్ష పదవి ఇస్తుందని భావించానని.. కానీ మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడట.. ‘తాను వైసీపీలో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడు మంత్రిగా ఉండేవాడిని.. నా బలమైన నలుగురైదుగురు నామినేటెడ్ పోస్టులు పొందేవారు. కానీ ఇప్పుడు నమ్మిన బీజేపీ తన రాజకీయ జీవితాన్ని ముగించింది’ అంటూ కన్నా సన్నిహితుల వద్ద వాపోతున్నారట..