‘అవినీతి రహిత పాలన’. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ ఇది. ఎన్నో కేసులో A 1ముద్దాయి అయిన మన ముఖ్యమంత్రి గారు ఈ ప్రతిజ్ఞ చేసినప్పుడు కొంతమంది కస్సుమని నవ్వారు. అయితే అతని పాలన మొదలయ్యి సంవత్సరం రోజులు అవుతున్నా కూడా రాష్ట్రమంతటా అవినీతి ఆరోపణలు అయితే వస్తున్నాయి కానీ ఇప్పటివరకు ఏవి రుజువు కాలేదు. ఈ సమయంలో జగన్ గోటితో పోయేదానికి గొడ్డలి దాక తెచ్చుకోవడం ఎందుకు అనుకున్నాడో ఏమో కానీ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ఆరాతీసి ఒక నివేదిక ఇవ్వమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెప్పినట్లు తెలిసింది.
Also Read: దెబ్బకి జగన్ పరువంతా పోయింది..! “నిండా మునిగిపోయాడు”
ముఖ్యంగా ఇసుక రవాణా లో అధికార పార్టీ నేతలే అక్రమాలకు పాల్పడుతున్నారని…. అలాగే మద్యం విక్రయాల్లో కూడా అవకతవకలు జరుగుతున్నాయని ప్రతిపక్ష నేతలు ముందు నుండి గగ్గోలు పెడుతున్నారు. ఇది కరోనా సమయం కావడంతో వాటి తీవ్రత తగ్గింది కానీ…. జగన్ మాత్రం ఇదే సరైన సమయమని.. నివేదిక తయారు చేయించాడు. ఇంటెలిజెన్స్ వర్గాల సహాయంతో పెద్దిరెడ్డి చాలా రహస్యంగా చేపట్టిన ఈ విచారణలో ఎంతో మంది పేర్లు బయట పడ్డాయి. వైసీపీ నేతలు చినాచితకా పనుల కోసం చేతులు చాస్తున్నారని…. అలాగే ఇసుక అక్రమాలు కూడా యథేచ్చగా జరుగుతూనే ఉన్నాయని బయటపడిందట. ఈ నివేదిక కాస్తా వెళ్లి జగన్ టేబుల్ పైన చేరింది.
Also Read: కారులో ముగ్గురు ఉండగానే తగలబెట్టేశాడు… విజయవాడలో దారుణం!
అంతే ఒక్కసారిగా వైసీపీ నేతల్లో భయం పట్టుకుంది. ఇప్పటికే ఈ విషయానికి సంబంధించి జగన్ ముగ్గురు మంత్రులకు…. వారి బంధువులకు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ నివేదిక లో ఉన్న పేర్లలో చాలా మంది బయట పార్టీల నుండి వచ్చి ఇక్కడ పదవి దక్కించుకొని అక్కడ చేసిన పనులే ఇక్కడ చేస్తున్నారని తేలింది. వారందరికీ జగన్ ఎలా కంట్రోల్ చేస్తాడు అన్నది ఇక్కడ ఆసక్తికర విషయం. అసలే ఈ సమయంలో అతనికి నేతల సపోర్ట్ కావాలి. కోర్టు, నాలుగు జిల్లాల ప్రజలు అతనికి వ్యతిరేకంగా ఉన్నారు. ఈ సమయంలో జగన్ సొంత పార్టీ నేతలను దండించడం అంటే కత్తి మీద సామే.