‘తేజస్వి మడివాడ’.. ఈ అమ్మడు తెలుగు అమ్మాయినే. కాకపోతే వ్యవహారంలోనే తెలుగుతనం ఉండదు. నిజానికి అమ్మడు సాత్వికమే కాకపోతే వెరీ బోల్డ్ అంతే. ఇక ఉన్నది ఉన్నట్టు మాట్లాడటంలో ఈ బ్యూటీ మేటి. అయినా ఉన్నది ఉన్నట్టు ఏమిటి ? ఏమైనా మాట్లాడగలదు. ఆ మాట్లాడటంలో బూతులకు ప్రముఖ స్థానం ఉంటుంది. ఏ రేంజ్ లో ఉంటుందో ఎదుటి మనిషిని బట్టి ఉంటుందని ఆ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తేజస్వి సిగ్గుపడుతూ చెప్పింది లేండి.
ఇక తాజాగా ఒకప్పటి తన మనసులోని మరో బాగోతం గురించి సెలవిచ్చింది. ‘ఈ భామ చిన్నప్పుడు పానీపూరి బండి వాడిని పెళ్లి చేసుకోవాలని తెగ ఉబలాట పడింది అట. కాకపోతే అది మనసులోనే. ఇక ఇప్పుడు అనగా ఆమె మాటల్లోనే.. ‘ఇప్పుడంటే పెద్దయ్యాను కదా.. అందుకే అసలు పెళ్లే అనవసరమని తెలుసుకున్నాను’ అంటూ ఓ స్టేట్ మెంట్ కూడా పాస్ చేసింది.
తేజస్వి పోస్ట్ చేసిన తన క్యాప్షన్ కి కొంత మంది నెటిజన్లు పాజిటివ్ గా సరదాగా రెస్పాండ్ అవుతుంటే.. మరికొంతమంది మాత్రం..’అవున్లే.. నీకు పెళ్లి అనవసరమే’ అని ఒకరు, పెళ్లి చేసుకోకపోయినా మీరు కోల్పోయేది ఏమీ లేదు లేండి’ అంటూ మరొకరు ఇలా తేజస్వి పై జోకులు వేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు.
ఇక తేజస్వి సినిమాల విషయానికి వస్తే.. మొదట్లో పలు తెలుగు సినిమాల్లో మంచి పాత్రలతో బాగానే అవకాశాలు తెచ్చుకుంది. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా, ప్రజెంట్ అయితే సైడ్ క్యారెక్టర్ లు కూడా రావడం లేదు. సినిమాలు లేకపోయినా.. తేజస్వి మాత్రం నిత్యం సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటూ సంతోషంగా టైం పాస్ చేస్తోంది.
అన్నట్టు హీరోయిన్ గా తనకు అవకాశాలు రావడం లేదని తానూ ఎప్పుడు ఫీల్ అవ్వదు తేజశ్వి. జీవితంలో ఇక పెళ్లి చేసుకోకపోయినా కానీ, బాయ్ ఫ్రెండ్ ను మాత్రం మెయింటైన్ చేస్తానంటోంది.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Tejaswi madiwada says when i was child i wanted marry panipuri wala
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com