https://oktelugu.com/

టీజర్ టాక్: హౌస్ అరెస్ట్‌లో నలుగురు కమెడియన్లు

టాలీవుడ్ లో మరో ట్రైలర్ రిలీజ్ అయ్యింది. కామెడీ ఎంటర్టైనర్ గా తీసిన చిత్రం ‘హౌస్ అరెస్ట్’. ఈ చిత్రం టీజర్‌ను ఈరోజు రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో నలుగురు ప్రముఖ హాస్యనటులు – శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, తాగుబోతు రమేష్, రఘు కరుమాంచి నటించారు. వీరు ఈ సినిమాలో దొంగలుగా నటించారు. నలుగురు దొంగలుగా మారి ఈ ముఠాగా ఏర్పడి కొంటె పిల్లల ముఠాను అపహరించడానికి ప్రయత్నిస్తారు. ఈ చిత్రం కాన్సెప్ట్ మొత్తం కామెడీ.. నాటకీయ […]

Written By: , Updated On : February 27, 2021 / 10:16 PM IST
Follow us on

టాలీవుడ్ లో మరో ట్రైలర్ రిలీజ్ అయ్యింది. కామెడీ ఎంటర్టైనర్ గా తీసిన చిత్రం ‘హౌస్ అరెస్ట్’. ఈ చిత్రం టీజర్‌ను ఈరోజు రిలీజ్ చేశారు.

ఈ చిత్రంలో నలుగురు ప్రముఖ హాస్యనటులు – శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, తాగుబోతు రమేష్, రఘు కరుమాంచి నటించారు. వీరు ఈ సినిమాలో దొంగలుగా నటించారు.

నలుగురు దొంగలుగా మారి ఈ ముఠాగా ఏర్పడి కొంటె పిల్లల ముఠాను అపహరించడానికి ప్రయత్నిస్తారు. ఈ చిత్రం కాన్సెప్ట్ మొత్తం కామెడీ.. నాటకీయ సంఘటనల ఆధారంగా ప్రధాన కథను తయారు చేశారని టీజర్ ను బట్టి తెలుస్తోంది.

‘హౌస్ అరెస్ట్’ చిత్రానికి శేఖర్ రెడ్డి యెర్రా దర్శకత్వం వహించారు. ప్రిమేషో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ కింద కె నిరంజన్ రెడ్డి నిర్మించారు. ప్రముఖ సంగీత దర్శకుడు అనుప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు.

ఈ చిత్రంలో రవి బాబు, రవి ప్రకాష్ ముఖ్య పాత్రల్లో నటించారు. హౌస్ అరెస్ట్ సరదాగా నిండిన ఎంటర్టైనర్ అవుతుందని మేకర్స్ హామీ ఇస్తున్నారు.

House Arrest Teaser |Primeshow Ent|Srinivas Reddy|Saptagiri|SekharReddy Yerra|Anup Rubens|