బీజేపీకి టార్గెట్ ఫిక్స్ చేసిన కేటీఆర్..

బీజేపీ బలాన్ని కేటీఆర్ గ్రహించారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఆ పార్టీ సోషల్ మీడియాతో అసత్యప్రచారం చేస్తోందని మంత్రి కేటీఆర్ భావిస్తున్నారు. తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపుపై టీఆర్ఎస్ భవన్ లో నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహారించాల్సిన అవసరం ఉందని నేతలకు హితబోధ చేశారు. ఈ క్రమంలోనే బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్ లో పట్టుభద్రల ఎమ్మెల్సీ ఎన్నికలపై టీఆర్ఎస్ సన్నాహక సమావేశం నిర్వహించారు. మంత్రులు, జీహెచ్ఎంసీ నేతలు, […]

Written By: NARESH, Updated On : February 27, 2021 10:33 pm
Follow us on

బీజేపీ బలాన్ని కేటీఆర్ గ్రహించారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఆ పార్టీ సోషల్ మీడియాతో అసత్యప్రచారం చేస్తోందని మంత్రి కేటీఆర్ భావిస్తున్నారు. తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపుపై టీఆర్ఎస్ భవన్ లో నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహారించాల్సిన అవసరం ఉందని నేతలకు హితబోధ చేశారు. ఈ క్రమంలోనే బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ భవన్ లో పట్టుభద్రల ఎమ్మెల్సీ ఎన్నికలపై టీఆర్ఎస్ సన్నాహక సమావేశం నిర్వహించారు. మంత్రులు, జీహెచ్ఎంసీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు , చైర్మన్లు అందరూ హాజరయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు వ్యూహంపై చర్చించారు.

ఈ సందర్భంగా ఆగమాగం చేస్తోందని.. ఢిల్లీ నుంచి గల్లీదాకా అసత్యప్రచారం చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ కు చరిత్ర ఉందని.. కానీ భవిష్యత్తు లేదన్నారు. బీజేపీకి తెలంగాణలో ఓటు అడిగే నైతిక హక్కు లేదని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులకు నిధులు ఇవ్వడం లేదన్నారు.

గత ఆరేళ్లలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లాలని కేటీఆర్ సూచించారు. మన ప్రభుత్వం గత ఆరేళ్లలో అభివృద్ధి, సంక్షమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని కోరారు.

ముఖ్యంగా టీఆర్ఎస్ పై యువత, నిరుద్యోగులకు వ్యతిరేకత నింపారని.. వాటిని తొలగించే బాధ్యతను ప్రస్తుతం చేపట్టాలని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది.