ఐపీఎల్ మ్యాచ్ లు ఈ ఐదు నగరాల్లో.. వేదికలు ఖరారు

కరోనా కల్లోలంతో పోయిన సారి దుబాయ్ లో జరిగిన ఐపీఎల్.. ఈసారి దేశంలోనే నిర్వహించనున్నారు. దుబాయ్ కంటే ఇండియాలోనే తక్కువ కేసులు నమోదు అవుతుండడం.. ఇంగ్లండ్ తో సీరీస్ దిగ్విజయంగా సాగుతుండడంతో ఇండియాలోనే ఐపీఎల్ నిర్వహించేందుకు నిర్ణయించింది. ఈ క్రమంలోనే అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈసారి స్డేడియాల్లో 50శాతం మంది అభిమానులకు అనుమతిస్తామని బీసీసీఐ డిసైడ్ అయ్యింది. దీంతో తమ అభిమాన జట్లకు మద్దతుగా ప్రేక్షకులు సందడి చేయనున్నారు. ఇక ఐపీఎల్ మ్యాచ్ లన్నీ ఈసారి […]

Written By: NARESH, Updated On : February 27, 2021 8:44 pm
Follow us on

కరోనా కల్లోలంతో పోయిన సారి దుబాయ్ లో జరిగిన ఐపీఎల్.. ఈసారి దేశంలోనే నిర్వహించనున్నారు. దుబాయ్ కంటే ఇండియాలోనే తక్కువ కేసులు నమోదు అవుతుండడం.. ఇంగ్లండ్ తో సీరీస్ దిగ్విజయంగా సాగుతుండడంతో ఇండియాలోనే ఐపీఎల్ నిర్వహించేందుకు నిర్ణయించింది.

ఈ క్రమంలోనే అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈసారి స్డేడియాల్లో 50శాతం మంది అభిమానులకు అనుమతిస్తామని బీసీసీఐ డిసైడ్ అయ్యింది. దీంతో తమ అభిమాన జట్లకు మద్దతుగా ప్రేక్షకులు సందడి చేయనున్నారు.

ఇక ఐపీఎల్ మ్యాచ్ లన్నీ ఈసారి దేశంలోని కీలకమైన ఐదు నగరాల్లో నిర్వహిస్తారు. ఢిల్లీ, చెన్నై, కోల్ కతా,బెంగళూరు, ముంబైలను బీసీసీఐ కేంద్రాలుగా ఎంపిక చేసింది. ఈ ఐదు నగరాల్లో లీగు మ్యాచులు.. అహ్మదాబాద్ లోని మొతేరాలో ప్లే ఆఫ్స్ నిర్వహించాలని బీసీసీఐ డిసైడ్ అయ్యింది.

అయితే గతంలో మాదిరిగా రోజుకో స్టేడియంలో మ్యాచ్ లు జరగవు. ఒక్కో మైదానంలో ఒకసారి అన్ని జట్లు తలపడుతాయి. తర్వాత వేదిక మారుతుంది. ఆ నగరం వెళ్లాక మరోసారి అన్ని జట్లు తలపడుతాయి. ఈ మ్యాచ్ లు ముగిశాక మొతేరాలో ప్లే ఆఫ్స్ నిర్వహిస్తారు.

సీజన్ జరిగేంత వరకు ప్రతీ ఐదురోజులకు ఒకసారి ఆటగాళ్లు కరోనా టెస్టులు నిర్వహిస్తారు. కఠినమైన బయో బుడగ ఏర్పాటు చేసి లీగ్ నిర్వహిస్తారు.