ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడించి చారిత్రక విజయాన్ని అందుకున్న టీమిండియా ఇప్పుడు సొంత గడ్డపై ఇంగ్లండ్ జట్టును ఢీకొనబోతోంది. ఆస్ట్రేలియా కెప్టెన్ కోహ్లీ సహా కీలక ఆటగాళ్లంతా గాయాలతో జట్టుకు దూరమైతే నెట్ బౌలర్లు, బీ గ్రేడ్ క్రికెటర్లతో ఆడిన టీమిండియా అద్భుత విజయాలను సాధించింది. ఈ క్రమంలో ఇప్పుడు ఇంగ్లండ్ తో జట్టు కూర్పు టీమిండియాకు సవాల్ గా మారింది.
Also Read: ఫోటో షేర్ చేసి కూతురి పేరు రివీల్ చేసిన ‘విరుష్క’
ఆస్ట్రేలియాను ఓడించిన ఆ యువ జట్టుతో బరిలోకి దిగాలా? లేక దిగ్గజాలైన సీనియర్లతో టీంను సిద్ధం చేయాలా? అన్నది ఇప్పుడు టీమిండియా యాజమాన్యానికి పరీక్షగా మారింది.
అయితే ఇంగ్లండ్ పటిష్ట జట్టు కావడం.. పైగా భారత్ లో జరుగుతుండడంతో టీమిండియా బోలెడన్నీ మార్పులు చేయడానికి రెడీ అయ్యింది. ఆస్ట్రేలియాపై గెలిచిన జట్టులోని సగం మందికి ఇంగ్లండ్ తో సిరీస్ లో స్తానం దక్కేలా లేదు.
శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్టుకు ఆస్ట్రేలియాలో అంచనాలకు మించి రాణించిన సిరాజ్, శార్ధూల్, లకు ఇంగ్లండ్ తో తొలి టెస్టుకు స్థానం దక్కడం కష్టమే అంటున్నారు. వాషింగ్టన్ సుందర్, సైనీలకు డౌట్ యేనట..
ఆస్ట్రేలియాతో టెస్టుల్లో ఆడిన రహానే, పూజారా, అశ్విన్ లకు మాత్రమే చోటు ఖాయంగా కనిపిస్తోందట.. పంత్ కూడా డౌట్ అంటున్నారు. పంత్ కన్నా సాహాకే వికెట్ కీపర్ గా ప్రాధాన్యతనిచ్చే అవకాశాలున్నాయంటున్నారు. వన్డేల్లో టీట్వంటీల్లో ఆల్ రెడీ కేఎల్ రాహుల్ కీపర్ బ్యాట్స్ మెన్ గా క్లిక్ అయ్యాడు. టెస్టుల్లో పంత్, సాహాలు పోటీపడుతున్నారు.
Also Read: కుంబ్లేలా మారిన బుమ్రా.. ఇక లెగ్ స్పిన్ బౌలింగ్ నా?
ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. ఇషాంత్ కు చోటు ఖాయంగా కనిపిస్తోంది. బుమ్రా ఎలాగూ ఉంటాడు. ముగ్గురు స్పిన్నర్లతో టీమిండియా బరిలోకి దిగుతుందని అంటున్నారు. అశ్విన్ కు తోడుగా కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ లు ఉంటారని సమాచారం. జడేజా గాయపడడంతో అక్షర్ కు స్థానం దక్కవచ్చని అంటున్నారు. వాషింగ్టన్ సుందర్ బాగా రాణించినా అతడి కంటే అక్షర్ పటేల్ వైపే జట్టు యాజమాన్యం మొగ్గు చూపుతోందట.. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఉండడం అక్షర్ కు కలిసి వచ్చిందని అంటున్నారు.
ఆస్ట్రేలియా రాణించిన జట్టులోని చాలా మందిని ఇంగ్లండ్ తో కూర్పులో తీసుకోవడం కష్టమేనంటున్నారు. టీమిండియా మొత్తం గాయపడినా భర్తీ చేయగల ఆటగాళ్లు అందుబాటులో ఉండడం కలిసి వస్తోందని అంటున్నారు.