https://oktelugu.com/

మోడీ ఫెయిల్ అయ్యేది.. కేసీఆర్, జగన్ లు హిట్ అయ్యింది అక్కడే?

దేశంలోని బీజేపీ అన్నదాతల ఆగ్రహానికి గురి అవుతుంటే.. తెలుగు రాష్ట్రాల్లోని రైతులు మాత్రం గుండెల మీద చేయి వేసుకొని హాయిగా వ్యవసాయం చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలకు రైతుల ఆందోళన ప్రభావం పాకలేదు. కారణం.. ఇక్కడి రెండు తెలుగు ప్రభుత్వాలు రైతు సంక్షేమానికి పెద్దపీట వేయడమే.. ఉచిత కరెంట్.. విత్తనాలు, సబ్సిడీలు, కొనుగోలుకేంద్రాలతో రైతులు చీకు చింతా లేకుండా ఉన్నారు.. Also Read: రైతుల ఉద్యమాన్ని ఆపేందుకు బీజేపీ దారుణాలివీ! తెలంగాణలో కేసీఆర్ రైతులను నెత్తిన పెట్టుకున్నాడు..ఏ రంగానికి […]

Written By:
  • NARESH
  • , Updated On : February 3, 2021 / 08:41 AM IST
    Follow us on

    దేశంలోని బీజేపీ అన్నదాతల ఆగ్రహానికి గురి అవుతుంటే.. తెలుగు రాష్ట్రాల్లోని రైతులు మాత్రం గుండెల మీద చేయి వేసుకొని హాయిగా వ్యవసాయం చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలకు రైతుల ఆందోళన ప్రభావం పాకలేదు. కారణం.. ఇక్కడి రెండు తెలుగు ప్రభుత్వాలు రైతు సంక్షేమానికి పెద్దపీట వేయడమే.. ఉచిత కరెంట్.. విత్తనాలు, సబ్సిడీలు, కొనుగోలుకేంద్రాలతో రైతులు చీకు చింతా లేకుండా ఉన్నారు..

    Also Read: రైతుల ఉద్యమాన్ని ఆపేందుకు బీజేపీ దారుణాలివీ!

    తెలంగాణలో కేసీఆర్ రైతులను నెత్తిన పెట్టుకున్నాడు..ఏ రంగానికి లేనంతగా కేటాయింపులు చేశారు. రైతులకు ఉచిత విద్యుత్, కాళేశ్వరం సహా ప్రాజెక్టులతో నీళ్లు, విత్తనాలు, ఎరువులు, సబ్సిడీలతో తెలంగాణ రైతాంగాన్ని దేశంలోనే నంబర్ 1గా నిలిపారు. పోయినసారి దేశంలో అత్యధిక వరిని పండించింది తెలంగాణనే కావడం విశేషం. అందుకే ఇక్కడ రైతుల అలజడి లేదు. అదే సమయంలో నిరుద్యోగులు, ఇతర వర్గాలు కేసీఆర్ పై పీకల్లోతు కోపంగా ఉండి ఆయనకు వ్యతిరేకంగా ఓటేస్తున్నాయి.

    ఇక సీఎం జగన్ గద్దెనెక్కాక ఫక్తు సంక్షేమ రాజ్యాన్ని నెలకొల్పారు. ప్రధానంగా నవరత్నాల పేరుతో రైతులకే కాదు.. అన్ని వర్గాల ప్రజలకు డైరెక్టుగా నిధుల వ్యయం చేశారు. తాజాగా ఏపీలో రైతుల కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్లను నిర్వహిస్తున్నారు. రైతుల రక్షణకు.. రైతుల సమస్యల పరిష్కారం కోసం ఏకంగా జిల్లాకో పోలీస్ స్టేషన్ ఏర్పాటుచేస్తూ సీఎం జగన్ రైతులకు పెద్దపీట వేశారు.

    Also Read: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణ ఎవరికి ఎన్ని సీట్లంటే?

    అందుకే ఢిల్లీలో రైతుల విషయంలో మోడీ ఫెయిల్ అయితే.. తెలుగు రాష్ట్రాల సీఎంలు మాత్రం హిట్ అయ్యారు. రైతులకు నగదు బదిలీని చేసి మోడీ వారిని అలాగే వదిలేస్తే వారి పని వారు చేసుకునేవారు. అయితే కొత్త వ్యవసాయా చట్టాలు తేవడం.. అవి కార్పొరేట్లకు దోచిపెట్టేలా ఉన్నాయన్న విమర్శలు రావడం.. వాటిపై రైతులకు అవగాహనను బీజేపీ కల్పించకపోవడం దెబ్బకొచ్చింది. బీజేపీ కనుక ప్రతిపక్షాలు, రైతు సంఘాలు, రైతులను సంప్రదించి కనుక కొత్త చట్టాలు చేస్తే ఇప్పుడు ఫలితం వేరోలా ఉండేది. మొత్తానికి సాగుచట్టాలతో రైతుల దృష్టిలో మోడీ విలన్ అవ్వగా.. తెలుగు రాష్ట్రాల సీఎంలు మాత్రం హీరోలైపోయారనే చెప్పాలి.