తిరుపతిలో బరి నుంచి తప్పుకుంటాం కానీ..! : జనసేనకు బీజేపీ మెలిక

ఏపీలో బీజేపీ–జనసేనలు మిత్రపక్షంగా కొనసాగుతున్నాయి. అయితే.. ఇప్పుడు ఈ మిత్రపక్షానికి ఓ పెద్ద పరీక్ష ఎదురుకాబోతోంది. మరికొద్ది రోజుల్లో తిరుపతి లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతోంది. ఈ స్థానానికి తాము బరిలో ఉంటామంటే.. లేదు తామే పోటీ చేస్తామంటూ ఇరు పార్టీలు దెబ్బలాడుకుంటున్నాయి. తిరుపతిలో తమకే ఓటు బ్యాంకు ఉందని జనసేన ఆ సీటు కోసం పట్టుబడుతుండగా.. ఈ ఉప ఎన్నికతో తమ సత్తా చాటుతామని బీజేపీ చెబుతోంది. Also Read: మోడీ ఫెయిల్ అయ్యేది.. […]

Written By: Srinivas, Updated On : February 3, 2021 10:22 am
Follow us on


ఏపీలో బీజేపీ–జనసేనలు మిత్రపక్షంగా కొనసాగుతున్నాయి. అయితే.. ఇప్పుడు ఈ మిత్రపక్షానికి ఓ పెద్ద పరీక్ష ఎదురుకాబోతోంది. మరికొద్ది రోజుల్లో తిరుపతి లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతోంది. ఈ స్థానానికి తాము బరిలో ఉంటామంటే.. లేదు తామే పోటీ చేస్తామంటూ ఇరు పార్టీలు దెబ్బలాడుకుంటున్నాయి. తిరుపతిలో తమకే ఓటు బ్యాంకు ఉందని జనసేన ఆ సీటు కోసం పట్టుబడుతుండగా.. ఈ ఉప ఎన్నికతో తమ సత్తా చాటుతామని బీజేపీ చెబుతోంది.

Also Read: మోడీ ఫెయిల్ అయ్యేది.. కేసీఆర్, జగన్ లు హిట్ అయ్యింది అక్కడే?

అయితే.. ఇప్పుడు ఏపీలో ఇదే హాట్‌టాపిక్‌ అయింది. హాట్‌ కేక్‌ లాంటి తిరుపతి సీటును కమలం జనసేనకు త్యాగం చేస్తుందా లేదా అనేది టాక్‌ నడుస్తోంది. తిరుపతి సీటు ఖాళీ అయిన రోజు నుంచి కమలనాథులు అనేక వ్యూహాలతో తిరుపతిని చుట్టుముట్టేస్తున్నారు. అంతే కాదు బీజేపీ–జనసేన ప్రకటించే అభ్యర్థిని గెలిపించాలంటూ ప్రచారం మొదలు పెట్టింది కూడా. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల నుంచి తప్పుకున్నందుకు తిరుపతి సీటు తమకు కేటాయించాలని పవన్ కల్యాణ్ గత కొంతకాలంగా కోరుతున్నారు.

జనసేనాని కూడా బీజేపీ అధిష్టానం ముందు ఇదే ప్రపోజల్‌ను పెట్టాడట. కానీ.. కమలం అధిష్టానం మాత్రం దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దాంతో అప్పుడప్పుడు ఆయన అసహనం సైతం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. బీజేపీతో సీటు విషయంలో ఇంకా గందరగోళం కొనసాగుతోందంటూ పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యానించడం గమనిస్తే ఆయన ఇక ఓపిక పట్టేందుకు సిద్ధంగా లేనట్లే తెలుస్తోంది. ఈ సీటు లెక్క వచ్చే వారంలోగా తేల్చేస్తామంటూ కూడా పవన్ కల్యాణ్ చెప్పుకోవాలిసివచ్చింది.

Also Read: బాబు ఎమోషనల్.. నన్ను కూడా చంపేయండి

ఇదిలా ఉండగా.. తిరుపతి లోక్‌సభ సీటను వదులుకునేందుకు తమ పార్టీ సిద్ధమేనని.. అయితే ఆ స్థానం నుంచి పవన్ కల్యాణ్ సరైన అభ్యర్థిని బరిలోకి దింపి గెలుస్తామంటేనే తప్పుకుంటామంటూ మెలిక పెడుతోంది. ఈ ప్రతిపాదనకు పవన్ కల్యాణ్ ముందుకు వచ్చే అవకాశం ఉండదన్నట్లుగా కాషాయం వ్యూహం రచిస్తోందంటున్నారు. ఈ నేపథ్యంలో జనసేనను ఇరుకున పెట్టి తిరుపతిలో పోటీకి దిగేందుకు తమ ఎత్తుగడ పనికొస్తుందని భావిస్తోంది. అయితే ఇది ఒక ఎత్తుగడ మాత్రమే అని కొందరంటున్నారు. మొత్తానికి తిరుపతి లోక్ సభ స్థానంలో పోటీ పై ఈ రెండు ప్రధాన పార్టీల నడుమ సస్పెన్స్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. చివరికి ఎవరు బరిలో నిలుస్తారో చూడాలి మరి.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్