బరి తెగిస్తున్న టీడీపీ నేతలు.. ఎదురు తిరుగుతున్న ప్రజలు

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. కారణం ఏదైనా పల్లెల్లో గూండాగిరీ చలాయిస్తున్నారు. ప్రజలే కాదు అధికారులపై సైతం తమ అహాన్ని చూపిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు జరగకుండా అడ్డుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా పూర్తిచేయాలని సీఎం జగన్ ఏప్పటికే అన్నిశాఖల అధికారులకు సూచించారు. ఎక్కడా గొడవలకు తావుండకూడదని.. కక్షలు.. కుట్రలకు అవకాశం ఇవ్వొద్దని పేర్కొన్నారు. అయితే అవేమీ పట్టించుకోని కొందరు టీడీపీ పార్టీ నాయకులు రెచ్చిపోతున్నారు. నామినేషన్లు వేసే వారిపై దాడులకు […]

Written By: NARESH, Updated On : February 2, 2021 11:55 am
Follow us on

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. కారణం ఏదైనా పల్లెల్లో గూండాగిరీ చలాయిస్తున్నారు. ప్రజలే కాదు అధికారులపై సైతం తమ అహాన్ని చూపిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు జరగకుండా అడ్డుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా పూర్తిచేయాలని సీఎం జగన్ ఏప్పటికే అన్నిశాఖల అధికారులకు సూచించారు. ఎక్కడా గొడవలకు తావుండకూడదని.. కక్షలు.. కుట్రలకు అవకాశం ఇవ్వొద్దని పేర్కొన్నారు.

అయితే అవేమీ పట్టించుకోని కొందరు టీడీపీ పార్టీ నాయకులు రెచ్చిపోతున్నారు. నామినేషన్లు వేసే వారిపై దాడులకు తెగపడుతున్నారు. ఇటీవలే అచ్చెన్నాయుడు అనుచరులు..ఆయన సోదరుడి కుమారుడిని నామినేషన్ వేయకుండా అడ్డకున్న విషయం తెలిసిందే.. అతడు ఎలాగోలా చివరినిమిషంలో తప్పించుకుని వచ్చి.. నామినేషన్ దాఖలు చేశాడు. మరికొన్ని చోట్ల కూడా నామినేషన్లు వేయకుండా పలువురిని టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. ఓ వైపు ఏకగ్రీవ పంచాయతీ లను ప్రోత్సహించాలని ప్రభుత్వం సూచిస్తుంటే.. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వాటిని అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో నామినేషన్ వేసేందుకు వస్తున్న వైసీపీ మద్దతుదారులను టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు పంచాయతీ ఎన్నికల మొదటి విడతలో చాలా చోటు చేసుకున్నాయి.

ప్రజలనే కాకుండా ప్రభుత్వ అధికారులపై సైతం టీడీపీ నాయకులు తమ ప్రభావాన్ని చూపుతున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు సొంతజిల్లా అయిన.. చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ నాయకులు రెచ్చిపోతున్నారు. ఏకంగా మండల మేజిస్ట్రేట్‌ కార్యాలయంలోనే తహసీల్దార్‌పై దాడికి ప్రయత్నించారు. దళితులైన మహిళా అధికారులను కులం పేరుతో దూషించారు.

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు పేదలకు ఇంటి పట్టాలను పంపిణీ చేయాలని శనివారం పాకాల తహసీల్దార్‌ లోకేశ్వరి రెవెన్యూ సిబ్బందికి సూచించారు. అధికారులే ఇంటి పట్టాలను పంపిణీ చేస్తున్నారు. పట్టాలు ఎలా పంపిణీ చేస్తారని నేండ్రగుంటకు చెందిన టీడీపీ పాకాల మండల మాజీ అధ్యక్షుడు నాగరాజునాయుడు తహసీల్దార్‌ను ఫోన్‌లో దూషించాడు. పట్టాల పంపిణీని నిలిపివేయాలని, లేకుంటే అంతు చూస్తానని బెదిరించాడు. తర్వాత తహసీల్దార్‌ కార్యాలయానికి అనుచరులతో వెళ్లి తహసీల్దార్, రెవెన్యూ సిబ్బందిపై దాడికి ప్రయత్నించాడు.

దళితురాలైన తహసీల్దార్‌ లోకేశ్వరిని కులం పేరుతో దూషించాడు. ఆమేరకు లోకేశ్వరి ఆదివారం పాకాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాగరాజునాయుడు, మరో ఆరుగురిపై ఐపీసీ 448, 143,506, 509,353, 323 రెడ్‌విత్‌ 149 ఐపీసీ, 3(1)(యస్‌) ఎస్సీ, ఎస్టీ పీఓఏ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసినట్లు పాకాల ఎస్‌ఐ రాజశేఖర్‌ తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారు. ఎస్పీ సెంథిల్‌కుమార్‌ ఆదేశాల మేరకు ఎస్సీ, ఎస్టీ సెల్‌ జిల్లా డీఎస్పీ విజయశేఖర్‌ విచారణ చేపట్టారు.