https://oktelugu.com/

పుట్టగొడుగులు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..?

  మనలో చాలామంది పుట్టగొడుగులను తీసుకోవడానికి ఇష్టపడతారు. పుట్టగొడుగులు తినడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఔషధ గుణాలు పుష్కలంగా ఉండే పుట్టగొడుగులను తీసుకుంటే బీపీ, కడుపు రుగ్మతలు, క్యాన్సర్, గుండె జబ్బుల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. పుట్టగొడుగులు ఆరోగ్యంతో పాటు యవ్వనంగా ఉండటంలో సహాయపడతాయి. పుట్టగొడుగులను ఉడికించినా వాటిలో యాంటీ ఆక్సిడెంట్ల స్థాయి మారదు. పుట్టగొడుగులు ప్రొస్టేట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ ను నివారించడంలో సహాయపడతాయి. పుట్టగొడుగులు చర్మ సౌందర్యాన్ని ఇమడింపజేయడంతో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 2, 2021 / 11:47 AM IST
    Follow us on

     

    మనలో చాలామంది పుట్టగొడుగులను తీసుకోవడానికి ఇష్టపడతారు. పుట్టగొడుగులు తినడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఔషధ గుణాలు పుష్కలంగా ఉండే పుట్టగొడుగులను తీసుకుంటే బీపీ, కడుపు రుగ్మతలు, క్యాన్సర్, గుండె జబ్బుల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. పుట్టగొడుగులు ఆరోగ్యంతో పాటు యవ్వనంగా ఉండటంలో సహాయపడతాయి. పుట్టగొడుగులను ఉడికించినా వాటిలో యాంటీ ఆక్సిడెంట్ల స్థాయి మారదు.

    పుట్టగొడుగులు ప్రొస్టేట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ ను నివారించడంలో సహాయపడతాయి. పుట్టగొడుగులు చర్మ సౌందర్యాన్ని ఇమడింపజేయడంతో పాటు చర్మ సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉండే పుట్టగొడుగులు ఒత్తిడి, యాంగ్జయిటీలను తగ్గిస్తాయి. ఆర్థరైటిస్, ఎలర్జీల వల్ల వచ్చే జబ్బులను నివారించడంలో సహాయపడతాయి. హైడ్రేటింగ్ గుణాలు ఉన్న పుట్టగొడుగులు చర్మాన్ని మృదువుగా ఉంచడంలో సహాయపడతాయి.

    రొమ్ము క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ ల నివారణలో కూడా పుట్టగొడుగులు సహాయపడతాయి. మధుమేహంతో బాధ పడేవాళ్లు పుట్టగొడుగులను తీసుకుంటే మరీ మంచిది. ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో పుట్టగొడుగులు సహాయపడతాయి. అధిక బరువు సమస్యతో బాధ పడేవాళ్లు పుట్టగొడుగులను ఎక్కువగా తీసుకుంటే సులభంగా బరువు తగ్గవచ్చు. కారోహైడ్రేట్లు తక్కువగా ఉండే పుట్టగొడుగులు క్యాన్సర్లను అరికట్టడంలో సహాయపడతాయి.

    బీ విటమిన్ పుష్కలంగా ఉండే పుట్టగొడుగులు జీవక్రియ వేగం పెంచి కడుపు సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి. విటమిన్ డి లోపంతో బాధ పడేవాళ్లు పుట్టగొడుగులను తీసుకుంటే మరీ మంచిది. ఫోలిక్ ఆమ్లం ఉండే పుట్టగొడుగులు హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతాయి.