https://oktelugu.com/

టీజర్ తో ఆకట్టుకుంటున్న ”సుల్తాన్‌” !

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీకి తెలుగులోనూ మంచి డిమాండ్ ఉంది. అందుకే కార్తీ నటించిన ప్రతీ సినిమాను తెలుగులో కూడా భారీ స్థాయిలు విడుదల చేస్తూ వస్తున్నారు. కాగా కార్తీ నటించిన కొత్త సినిమా ”సుల్తాన్‌” సినిమా కూడా తెలుగులో రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. అలాగే, తాజాగా టీజర్ ను కూడా రిలీజ్ చేసింది చిత్రబృందం. ‘రెమో’ ఫేమ్ బక్కియరాజ్‌ కణ్ణన్‌ దర్శకత్వంలో డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ పై ఎస్.ఆర్ ప్రకాష్ బాబు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : February 2, 2021 / 11:57 AM IST
    Follow us on


    కోలీవుడ్ స్టార్ హీరో కార్తీకి తెలుగులోనూ మంచి డిమాండ్ ఉంది. అందుకే కార్తీ నటించిన ప్రతీ సినిమాను తెలుగులో కూడా భారీ స్థాయిలు విడుదల చేస్తూ వస్తున్నారు. కాగా కార్తీ నటించిన కొత్త సినిమా ”సుల్తాన్‌” సినిమా కూడా తెలుగులో రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. అలాగే, తాజాగా టీజర్ ను కూడా రిలీజ్ చేసింది చిత్రబృందం. ‘రెమో’ ఫేమ్ బక్కియరాజ్‌ కణ్ణన్‌ దర్శకత్వంలో డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ పై ఎస్.ఆర్ ప్రకాష్ బాబు – ఎస్.ఆర్ ప్రభు నిర్మించిన ఈ సినిమా టీజర్ బాగా అలరిస్తోంది.

    Also Read: క్రేజీ కలయిక నుండి ఇంట్రస్టింగ్ పోస్టర్ !

    టీజర్ ‘మహాభారతం చదివావా.. భారతంలో కృష్ణుడు వంద అవకాశాలు ఇచ్చినా కౌరవులు మారలేదు.. నువ్వు ఇవ్వమంటుంది ఒక్క అవకాశమే కదా.. ఇస్తా..’ అనే వాయిస్ ఓవర్ తో ప్రారంభమై.. కార్తి ఎంట్రీతో ఆసక్తి పెంచి.. ‘భారతంలో కృష్ణుడు పాండవుల పైపు నిలబడ్డాడు.. అదే కృష్ణుడు కౌరవుల వైపు ఉంటే.. అదే మహాభారతాన్ని యుద్ధం లేకుండా ఊహించుకోండి’ అంటూ కార్తీ చెప్పే డైలాగ్ కూడా సినిమా స్థాయిని చెబుతుంది. ముఖ్యంగా ఈ సినిమా నేపథ్యం కూడా చాల బాగా ఆకట్టుకునేలా ఉండటం, కార్తీ పెద్ద కొరడా పట్టుకొని చేసే ఫైట్ హైలైట్ గా నిలవడంతో సినిమా పై అంచనాలు రెట్టింపు అయ్యాయి.

    Also Read: పుష్ప విడుదల విషయంలో సుక్కు సీరియస్ !

    కాగా ఈ సినిమాలో కార్తీ సరసన లక్కీ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా కనిపించింది. టాలీవుడ్ శాండిల్ వుడ్ లలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక కు ఇది తమిళ డెబ్యూ మూవీ. ఈ చిత్రంలో సీనియర్ నటుడు నెపోలియన్ – లాల్ – యోగిబాబు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇక ఈ టీజర్ కి మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ మెర్విన్ నేపథ్య సంగీతం అదనపు ఆకర్షణగా నిలిచింది. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి రూబెన్ ఎడిటింగ్ వర్క్ చేశారు. ఈ చిత్రాన్ని తెలుగు తమిళ భాషల్లో ఏప్రిల్ 2వ తేదీన విడుదల చేయనున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్