మళ్లీ రెచ్చిపోయిన బాలయ్య.. అడ్డంగా వీడియోలో దొరికేశాడు

టాలీవుడ్ అగ్రహీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య బాబు మరోసారి రెచ్చిపోయాడు.. రొచ్చు రొచ్చు చేశాడు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఎమ్మెల్యే బాలక్రిష్ణ శనివారం హిందూపురం పట్టణంలో అభ్యర్థుల తరుఫున ప్రచారం నిర్వహిస్తుండగా ఓ అభిమాని చికాకు కలిగించడంతో సీరియస్ అయ్యారు. తాజాగా తన సొంత నియోజకవర్గం హిందూపురంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఓ వ్యక్తిపై ఎమ్మెల్యే బాలక్రిష్ణ చెయ్యి చేసుకున్నారు. హిందూపురం పట్టణంలోని శ్రీకంఠపురంలో ఓ ఇంటికి వెళ్లిన సమయంలో అక్కడ ఫొటో […]

Written By: NARESH, Updated On : March 6, 2021 4:16 pm
Follow us on

టాలీవుడ్ అగ్రహీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య బాబు మరోసారి రెచ్చిపోయాడు.. రొచ్చు రొచ్చు చేశాడు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఎమ్మెల్యే బాలక్రిష్ణ శనివారం హిందూపురం పట్టణంలో అభ్యర్థుల తరుఫున ప్రచారం నిర్వహిస్తుండగా ఓ అభిమాని చికాకు కలిగించడంతో సీరియస్ అయ్యారు.

తాజాగా తన సొంత నియోజకవర్గం హిందూపురంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఓ వ్యక్తిపై ఎమ్మెల్యే బాలక్రిష్ణ చెయ్యి చేసుకున్నారు.

హిందూపురం పట్టణంలోని శ్రీకంఠపురంలో ఓ ఇంటికి వెళ్లిన సమయంలో అక్కడ ఫొటో తీయడానికి అభిమాని ప్రయత్నించడంతో అతడిపై బాలక్రిష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫొటో తీయవద్దంటూ వారించిన ఆయన అనంతరం అభిమాని చెంప చెల్లుమనిపించారు.

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మూడు రోజులు బాలయ్య మూడు రోజులుగా హిందూపురంలో బాలక్రిష్ణ రోడ్ షో నిర్వహిస్తున్నారు. పర్యటన మొదటిరోజే టీడీపీ నేతలపై బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాత మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో నవ్విన టీడీపీ నేతలపై బాలక్రిష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మూడోరోజు బాలయ్య రోడ్ షోకు జనం లేక వెలవెలబోయింది. దీంతో బాలయ్య అసహనం వ్యక్తం చేసి అక్కడి నుంచి నేరుగా ఇంటికి వెళ్లిపోయారని సమాచారం.

గతంలోనూ బాలక్రిష్ణ అభిమానులపై దాడులు చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడూ ఓ యువకుడిపై దాడి చేశారు.