https://oktelugu.com/

బ్రేకింగ్: టీడీపీ యువనేత మృతి.. టీడీపీలో తీవ్ర విషాదం

ఏలూరు మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత మాగంటి బాబు కుమారుడు మాగంటి రాంజీ మృతి చెందారు. గత కొన్ని రోజులుగా రాంజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల ఆయన నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించడంతో చికిత్స పొందుతున్నాడు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. అయితే అనారోగ్యానికి గల కారణం కుటుంబ సభ్యులు బయటపెట్టడం లేదు. ఆత్మహత్యాయత్నం చేశారనే ప్రచారం ఉంది.దీనిపై […]

Written By:
  • NARESH
  • , Updated On : March 8, 2021 / 08:38 AM IST
    Follow us on

    ఏలూరు మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత మాగంటి బాబు కుమారుడు మాగంటి రాంజీ మృతి చెందారు. గత కొన్ని రోజులుగా రాంజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

    ఇటీవల ఆయన నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించడంతో చికిత్స పొందుతున్నాడు.

    అప్పటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. అయితే అనారోగ్యానికి గల కారణం కుటుంబ సభ్యులు బయటపెట్టడం లేదు. ఆత్మహత్యాయత్నం చేశారనే ప్రచారం ఉంది.దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

    నిన్న మాజీ ఎంపీ మాగంటి బాబు కుటుంబ సభ్యులను కలిసి రాంజీ ఆరోగ్య వివరాలను లోకేష్ అడిగి తెలుసుకున్నారు. లోకేష్ ఆయన త్వరగా కోలుకొని మళ్లీ ముందుకు వస్తారని ధైర్యం చెప్పారు. కానీ ఈ లోపు ఆయన మరణవార్త టీడీపీలో విషాదం నింపింది.