ఎమ్మెల్సీ ఎన్నికల వేళ కేటీఆర్ కు జర్నలిస్టులు గుర్తొచ్చారా?

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ మంత్రి కేటీఆర్ కు జర్నలిస్టులు గుర్తొచ్చారు. సడెన్ గా ఆయన జర్నలిస్టులపై వరాల వాన కురిపించారు. తెలంగాణ ఏర్పాడ్డాక ఆరేళ్లుగా జర్నలిస్టులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరినా తెలంగాణ సర్కార్ పట్టించుకున్న పాపాన పోలేదన్న విమర్శ ఉంది. దీనివెనుక ఎమ్మెల్సీ ఎన్నికలే కారణమన్న చర్చ సాగుతోంది. తాజాగా మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోని జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యతను వ్యక్తిగతంగా తాను తీసుకుంటానని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, […]

Written By: NARESH, Updated On : March 7, 2021 8:34 pm
Follow us on

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ మంత్రి కేటీఆర్ కు జర్నలిస్టులు గుర్తొచ్చారు. సడెన్ గా ఆయన జర్నలిస్టులపై వరాల వాన కురిపించారు. తెలంగాణ ఏర్పాడ్డాక ఆరేళ్లుగా జర్నలిస్టులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరినా తెలంగాణ సర్కార్ పట్టించుకున్న పాపాన పోలేదన్న విమర్శ ఉంది. దీనివెనుక ఎమ్మెల్సీ ఎన్నికలే కారణమన్న చర్చ సాగుతోంది. తాజాగా మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలోని జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యతను వ్యక్తిగతంగా తాను తీసుకుంటానని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్నప్పటికీ ఆ బాధ్యతను తాను తీసుకుంటానని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

హైదరాబాద్ లోని జలవిహార్ లో జరిగిన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ప్రతినిధుల సమావేశానికి కేటీఆర్ హాజరై మాట్లాడారు. జర్నలిస్టులు, ఉద్యోగులు, న్యాయవాదులతో టీఆర్ఎస్ కు ఉన్నది పేగు బంధమని గతంలో జరిగిన పలు సంఘటనలు గుర్తు చేశారు.

ఇప్పటిదాకా మరణించిన 260మంది కుటుంబాలకు రూ. లక్షల చొప్పున ఇచ్చామని కేటీఆర్ అన్నారు. ఇలాంటి ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదు. జర్నలిస్టుల కుటుంబాల పిల్లలకు రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివించే బాధ్యతను టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటోంది. అండగా ఉన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో జర్నలిస్టులు తోడుగా నిలిచి ఆశీర్వదించాలని కేటీఆర్ కోరారు.

ఇలా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలకంగా ఉన్న జర్నలిస్టులను మచ్చిక చేసుకునే పనిలో కేటీఆర్ పడ్డారు. మరి ఆయన మాటలను జర్నలిస్టులు వింటారా? ఈ ఎన్నికల్లో సపోర్టు చేస్తారా? అన్నది వేచిచూడాలి.