Serials: అప్పట్లో హుర్రూతలూగించిన టాప్ టెన్ సీరియల్స్..!

టెలివిజన్ వచ్చిన కొత్తలో దూరదర్శన్ ఛానల్ ఒక్కటే ఉండేది. ఇందులో వార్తలు, చిత్రలహారి వంటి కార్యక్రమాలు వచ్చేవి. చిత్రలహారి కార్యక్రమం కోసం అప్పట్లో చాలామంది కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసేవాళ్లు. ఆ తర్వాత శాటిలైట్ యుగం ప్రారంభం కావడంతో టీవీ ఛానళ్లు విపరీతంగా పుట్టుకొచ్చాయి. ఇదే సమయంలో టెవిజన్ ఛానళ్లలో టీవీ సీరియల్స్ హవా ఎక్కువగా పెరిగిపోయింది. మన చిన్నతనం నుంచి ఇప్పటి వరకు కూడా వాటి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదంటే అతిశయెక్తి కాదేమో. సినిమా స్థాయిని […]

Written By: NARESH, Updated On : November 8, 2021 7:54 pm
Follow us on

టెలివిజన్ వచ్చిన కొత్తలో దూరదర్శన్ ఛానల్ ఒక్కటే ఉండేది. ఇందులో వార్తలు, చిత్రలహారి వంటి కార్యక్రమాలు వచ్చేవి. చిత్రలహారి కార్యక్రమం కోసం అప్పట్లో చాలామంది కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసేవాళ్లు. ఆ తర్వాత శాటిలైట్ యుగం ప్రారంభం కావడంతో టీవీ ఛానళ్లు విపరీతంగా పుట్టుకొచ్చాయి. ఇదే సమయంలో టెవిజన్ ఛానళ్లలో టీవీ సీరియల్స్ హవా ఎక్కువగా పెరిగిపోయింది. మన చిన్నతనం నుంచి ఇప్పటి వరకు కూడా వాటి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదంటే అతిశయెక్తి కాదేమో. సినిమా స్థాయిని తలదన్నేలా టెక్నాలజీని అందుపుచ్చుకుంటూ వినోదాన్ని పంచడంలో సీరియల్స్ ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి.

serials

టీవీ Serials ఎక్కువగా ఎమోషన్ ను ఆధారంగా చేసుకొని నడుస్తున్నాయి. ప్రతీ ఇంట్లో జరిగే సంఘటనలే సీరియల్స్ లో ఎక్కువగా కన్పిస్తుండటంతో మహిళలు వీటికి ఎక్కువగా అడిక్ట్ అవుతున్నారు. అత్త కోడళ్లను వేధిస్తుంచడం.. కోడలు అత్తకు బుద్దిచెప్పడం.. తోటికోడళ్ల మధ్య గొడవలు.. వారి మధ్య పన్నాగాలు.. ఆఫీసుల్లో బాస్ వేధింపులు వంటివి కన్పిస్తుంటాయి. అదేవిధంగా ప్రేమకథలు.. హర్రర్.. కామెడీ తరహాలోనూ దర్శకులు సీరియల్స్ ను తెరకెక్కిస్తూ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. చిన్నారుల నుంచి పెద్దవాళ్ల దాకా వీటిని ఆదరిస్తుండటంతో బుల్లితెరపై సీరియల్స్ క్రేజ్ రోజురోజుకు పెరిగిపోతుంది.

తెలుగు బుల్లితెరపై అప్పట్లో అందరినీ ఆకట్టుకున్న టాప్ టెన్ బెస్ట్ సీరియల్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సీరియల్స్ పేరు చెప్పగానే మీరంతా తప్పకుండా మీ బాల్యంలోకి వెళ్లడంలోకి ఖాయం. ఈ Serials ప్రారంభమయ్యేటప్పుడు వచ్చే పాటలు ఖచ్చితంగా గుర్తుకొస్తాయి. ప్రతీఒక్కరు తమ బాల్యంలో ఈ పాటలను హమ్ చేసే ఉండి ఉంటారు. ఆ మధుర జ్ఞాపకాలను మరొకసారి గుర్తుకు చేసుకుంటూ మీకు నచ్చిన సీరియల్స్ ఇందులో ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి.

వీటిలో ముందుగా ‘అంతరంగాలు’ సీరియల్స్ గురించి చెప్పుకోవాలి. ఈటీవీలో ప్రసారమైన ఈ సీరియల్ మహిళా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ‘అంతరంగాలు’ అనే టైటిల్ చెప్పగానే.. ‘అనంత మానస చందరంగాలు’ అనే లైన్ ఆటోమెటిక్ గా వస్తుంది. అంతలా ఈ సీరియల్ ఇంపాక్ట్ అందరిపై ఉంది. ఇక ఇదే ఫేమ్ తో ‘అందం’ అనే సీరియల్ ఈటీవలోనే ప్రసారమైంది. ఇది కూడా బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ‘అందం అందం జీవం సుమగుండం’ అంటూ కార్టూన్స్ తో వచ్చే పాట అందరికీ గుర్తుండే ఉంటుంది.

‘మెట్టెల సవ్వడి’.. ‘పిన్ని’.. ‘విధి’.. ‘ఎండమావులు’..‘అన్వేషిత’ వంటి సీరియల్స్ అప్పట్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచాయి. ఈ సీరియల్స్ ప్రారంభమయ్యే సమయంలో వచ్చే పాటతోనే అంతా అలర్ట్ అయిపోయే వాళ్లు. మహిళలు తమ భర్తలకు భోజనం కూడా వడ్డించకుండా ఈ సీరియల్స్ చూసేవాళ్లనే టాక్ ఉంది. అంతాలా ఈ Serials మహిళలను, చిన్నారులకు ఆకట్టుకున్నాయి. వీటిపై ఆ తర్వాతి కాలంలో ఎన్నో జోక్స్ కూడా సినిమాల్లో పేరడీలుగా వచ్చాయి.

సస్సెన్స్.. హర్రర్ నేపథ్యంలో వచ్చిన ‘మర్మదేశం’..‘కాష్మోరా’ సీరియల్స్ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కామెడీ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ‘అమ‌ృతం’ సీరియల్స్ కూడా అందరి ఫెవరేట్ Serials లో ఒకటిగా నిలిస్తుంది. ఇవన్నీ కూడా అప్పట్లో బుల్లితెర ప్రేక్షకులను టీవీలకు అతుక్కుపోయేలా చేసేవి. ఇందులో మీకు నచ్చిన సీరియల్ తోపాటు ఏదైనా సీరియల్ మిస్ అయి ఉంటే తప్పకుండా కింద కామెంట్ చేయండి.

ఇవి కూడా చదవండి: Heroines Remuneration టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లు వీరే..