chennnai:జలదిగ్భంధంలో ఆ 15 వార్డులు.. చెన్నైలో దారుణం..

భారీ వర్షాలతో చెన్నై సిటీ జలదిగ్భంధమైంది. నగరంలో ఎటు చూసిన నీరే కనిపిస్తోంది. ముఖ్యంగా 15 డివిజన్లలో పరిస్థితి మరీ దారుణంగా మారింది. వంట చేసుకోవడానికి వీలు లేకుండా ఎక్కడ చూసిన నీరే కనిపిస్తోంది. దీంతో ముఖ్యమంత్రి స్టాలిన్ స్వయంగా రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నారు. 15 డివిజన్లలో ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారులను నియమించి ప్రజలకూ మూడు పూటలా ఆహారాన్ని అందిస్తున్నారు. మరోవైపు ఎప్పటికప్పుడు వాతావరణ రిపోర్టు తెలుసుకుంటూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. చెన్నై సిటీతో […]

Written By: NARESH, Updated On : November 8, 2021 2:52 pm
Follow us on

భారీ వర్షాలతో చెన్నై సిటీ జలదిగ్భంధమైంది. నగరంలో ఎటు చూసిన నీరే కనిపిస్తోంది. ముఖ్యంగా 15 డివిజన్లలో పరిస్థితి మరీ దారుణంగా మారింది. వంట చేసుకోవడానికి వీలు లేకుండా ఎక్కడ చూసిన నీరే కనిపిస్తోంది. దీంతో ముఖ్యమంత్రి స్టాలిన్ స్వయంగా రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నారు. 15 డివిజన్లలో ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారులను నియమించి ప్రజలకూ మూడు పూటలా ఆహారాన్ని అందిస్తున్నారు. మరోవైపు ఎప్పటికప్పుడు వాతావరణ రిపోర్టు తెలుసుకుంటూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. చెన్నై సిటీతో పాటు కాంచీపురం, కన్యాకుమారి, మధురై పట్టణాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.

చెన్నైలోని అనేక ప్రాంతాలు నీటిలో మునిగిపోవడంతో సోమవారం సెలవు ప్రకటించారు. నగర రోడ్లపై సుమారు 4 నుంచి 5 అడుగుల మేర నీరు నిలిచిపోవడంతో ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి ఎదురైంది. దీంతో వార్డుకో ఐఏఎస్ అధికారిని నియమించారు. వీరంత ప్రజలకు ఆహారం అందించడంతో పాటు వారి క్షేమ సమాచారాన్ని తెలుసుకొని సీఎంకు తెలుపుతున్నారు. మరోవైపు సీఎం స్టాలిన్ గంట గంటకుపరిస్థితిని సమీక్షిస్తున్నారు. అయితే మరో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రభుత్వం అందుకు తగ్గ చర్యలు చేపడుతోంది.

దాదాపు మూడురోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులు పరిస్థితి ఇలాగే ఉండే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంటున్నారు. ఇప్పటికే కురిసిన వర్షాలతో చెన్నైలోని వేలచ్చేరి, సైదాపేట, టీ నగర్, గిండి తదితర ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. మహిళలు, పిల్లలు రోడ్ల మీదకు రావడం లేదు. ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. భారీ వర్షాల కారణంగా తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తమను కాపాడాలంటూ కొందరు దేవుడిని వేడుకుంటున్నారు.

2015లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అప్పటలో చెన్నైలో కురిసిన వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్పటి నుంచి ఇన్నేళ్లలో మళ్లీ ఇదే సంవత్సర చెన్నైలో అంత భారీ వర్షాలు ఇప్పుడే నమోదయ్యాయి. అయితే అప్పట్లో వర్షాల కారణంగా చాలా మంది నిరాశ్రయులై మరణించారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఎదురవుతుందా..? అని భయపడుతున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బాధితులకు ఆహారం అందడం లేదు.

ఇక తమిళనాడు ఎఫెక్ట్ ఏపీపై పడే అవకాశం ఉంది. మరో 48 గంటల్లో తమిళనాడు, ఏపీలోనూ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో చెన్నైలోని వాహనాల రాకపోకలను నిలిపివేశారు. అత్యవసరం ఉంటేనే బయటకు రావాలని అధికారులు తెలుపుతున్నారు.