Kamal Hasan: ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ కరెన్సీ హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వరుసగా బాడా వ్యాపార వేత్తలతో పాటు, సినీ ప్రముఖులు కూడా ఈ వైపుగా అడుగులేస్తున్నారు. తాజాగా నటుడు కమల్ హాసన్ కూడా తన 67వ పుట్టిన రోజు సందర్భంగా డిజిటల్ అవతార్ కోసం ఎన్ఎఫ్టీ ప్లాట్ఫామ్లోకి అడుగుపెట్టారు తన సూపర్ కలెక్షన్లతో నాన్-ఫంజిబుల్ టోకెన్స్(ఎన్ఎఫ్టీ) లాంచ్ చేయనున్నట్లు కమల్ హాసన్ వెల్లడించారు. దీంతో, వర్చువల్ రియాలిటీ స్పేస్‌లో తన సొంత డిజిటల్ అవతార్ మెటావర్స్‌లోకి అడుగుపెడుతున్న తొలి భారతీయ సెలెబ్రెటీగా కమల్ రికార్డు సృష్టించారు.
ఇటీవల బాలీవుడ్ బిగ్‌బీ కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాందించిన నేపథ్యంలో.. కమల్ కూడా సరికొత్త ట్రెండ్‌తో సంచలనం సృష్టిస్తోన్న ఎన్ఎఫ్టీ వేలంలోకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఈ క్రమంలోనే పాపులర్ మెటావర్స్‌గా డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టడం సంతోషంగా ఉందని కమల్ వెల్లడించారు. కాగా, కమల్ వంటి లెజెండ్ హీరోలు తమ ప్లాట్ఫామ్లో చేరడం ఎంతో సంతోషకరమని ఫాంటికో అభయానంద్ సింగ్ ఓ ప్రకటనలో తెలిపారు.
లోటస్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా కమల్ ఎన్‌ఎఫ్‌టీలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. కాగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌కు చెందిన అలనాటి పోస్టర్లు, ఆటోగ్రాఫ్‌లు బియాండ్‌లైఫ్. క్లబ్ నిర్వహించిన వేలంలో రికార్డు ధరకు అమ్ముడైన సంగతి తెలిసిందే. ఇటీవలేే సన్నీలియోన్ కూడా ఈ ప్లాట్ఫామ్లోకి అడుగుపెట్టింది.