ఇంగ్లండ్ తో టీ20: టీమిండియా నిలబడుతుందా? పడిపోతుందా?

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లతో టెస్ట్ సిరీస్ విజయాలను సాధించి ఊపు మీదున్న టీమిండియా.. టీ20 సిరీస్ కు వచ్చేసరికి తొలి మ్యాచ్ లో దెబ్బతింది. అరవీర భయంకర ఆటగాళ్లతో బరిలోకి దిగిన భారత్ ను ఇంగ్లండ్ చిత్తుగా ఓడించింది. కాగితం మీద భీకరంగా కనిపించిన టీమిండియా.. మైదానంలో దిగాక తేలిపోవడం చూసి అభిమానులు షాక్ తిన్నారు. తొలి మ్యాచ్ లో ఘోరంగా ఓడిపోయిన భారత జట్టు ఇప్పుడు రెండో మ్యాచ్ లో ఎదురుదెబ్బ తీయాలని పట్టుదలగా ముందుకెళుతున్నారు. […]

Written By: NARESH, Updated On : March 14, 2021 4:50 pm
Follow us on

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లతో టెస్ట్ సిరీస్ విజయాలను సాధించి ఊపు మీదున్న టీమిండియా.. టీ20 సిరీస్ కు వచ్చేసరికి తొలి మ్యాచ్ లో దెబ్బతింది. అరవీర భయంకర ఆటగాళ్లతో బరిలోకి దిగిన భారత్ ను ఇంగ్లండ్ చిత్తుగా ఓడించింది. కాగితం మీద భీకరంగా కనిపించిన టీమిండియా.. మైదానంలో దిగాక తేలిపోవడం చూసి అభిమానులు షాక్ తిన్నారు.

తొలి మ్యాచ్ లో ఘోరంగా ఓడిపోయిన భారత జట్టు ఇప్పుడు రెండో మ్యాచ్ లో ఎదురుదెబ్బ తీయాలని పట్టుదలగా ముందుకెళుతున్నారు. ఇంగ్లండ్ ప్రపంచంలోనే నంబర్ 1 జట్టు అయినా టీ20లో భారత్ ఇంకా బలంగా ఉంది. అయితే కోహ్లీ, కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్ లాంటి ఆటగాళ్లు తీవ్రంగా నిరాశ పరిచి సున్నాకే ఔట్ కావడం టీమిండియాను దెబ్బతీసింది. తొలి మ్యాచ్ లో విశ్రాంతి తీసుకున్న రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో ఆడటం ఖాయంగా కనిపిస్తోంది.

పంత్, పాండ్యా మంచి ఊపులో కనిపించారు. పెద్ద ఇన్నింగ్స్ లు వీరిద్దరూ ఆడటంతోపాటు టాప్ ఆర్డర్ రాణించాలి. ఇక బౌలింగ్ కూడా తేలిపోయింది. టెస్టుల్లో తిప్పేసిన అక్షర్ పటేల్ సిక్సులు సమర్పించాడు. భువనేశ్వర్ నిరాశపరిచాడు. స్పినర్ చాహల్ తేలిపోయి భారీగా పరుగులు ఇచ్చాడు.

మొత్తంగా తొలి టీ20లో భారత్ అన్ని రంగాల్లోనూ ఘోరంగా విఫలమైంది. కోహ్లీ సహా ప్రధాన బ్యాట్స్ మెన్ నుంచి ఈ మ్యాచ్ లో పెద్ద ఇన్నింగ్స్ లను జట్టు ఆశిస్తోంది. స్పిన్నర్లకు అనుకూలించే మొతేరా పిచ్ ను చాహల్, అక్షర్, సుందర్ ఉపయోగించుకుంటారేమో చూడాలి.

ఇక స్పిన్ ఆల్ రౌండర్ తెవాతియాకు అక్షర్ పటేల్ స్థానంలో అవకాశం ఇవ్వొచ్చు. ఇక సూర్యకుమార్, ఇషాన్ యాదవ్ లను తుది జట్టులోకి తీసుకుంటారా? లేదా అన్నది వేచిచూడాలి.

రోటేషన్ పద్ధతిలో భాగంగా రోహిత్ ను రెండు మ్యాచ్ లకు దూరం పెట్టానని ప్రకటించిన విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో బరిలోకి దిగాలని అందరూ కోరుకుంటున్నారు. రెండో టీ20లో రోహిత్ ను ఆడిస్తారేమో చూడాలి.