https://oktelugu.com/

మెగాస్టార్ మాట మీద నిలబడతారా ?

‘బిగ్ బాస్ సీజన్ 4’తో తన ప్రవర్తనతో అభిమానుల మనసులను కొల్లగొట్టాడు సయ్యద్ సోహెల్. నిజానికి బిగ్ హౌస్ లోకి వెళ్ళకముందు సోహెల్ కొన్ని సినిమాల్లో నటించినా అతను ఎవ్వరికి తెలియదు. కానీ బిగ్ బాస్ పుణ్యమా అని.. సోహెల్ హీరోగా కూడా మారిపోతున్నాడు. ఇప్పటికే తన సినిమా షూటింగ్ ను కూడా మొదలు పెట్టాడు. ‘జార్జ్ రెడ్డి’, ‘ప్రెజర్ కుక్కర్’ వంటి సినిమాలు తీసిన ప్రొడ్యూసర్ అప్పి రెడ్డి తన మూడో సినిమాని సోహెల్ తో […]

Written By:
  • admin
  • , Updated On : March 14, 2021 / 05:21 PM IST
    Follow us on


    ‘బిగ్ బాస్ సీజన్ 4’తో తన ప్రవర్తనతో అభిమానుల మనసులను కొల్లగొట్టాడు సయ్యద్ సోహెల్. నిజానికి బిగ్ హౌస్ లోకి వెళ్ళకముందు సోహెల్ కొన్ని సినిమాల్లో నటించినా అతను ఎవ్వరికి తెలియదు. కానీ బిగ్ బాస్ పుణ్యమా అని.. సోహెల్ హీరోగా కూడా మారిపోతున్నాడు. ఇప్పటికే తన సినిమా షూటింగ్ ను కూడా మొదలు పెట్టాడు. ‘జార్జ్ రెడ్డి’, ‘ప్రెజర్ కుక్కర్’ వంటి సినిమాలు తీసిన ప్రొడ్యూసర్ అప్పి రెడ్డి తన మూడో సినిమాని సోహెల్ తో ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

    Also Read: వర్మ నుండి మరో రాజకీయ సినిమా !

    అయితే, సోహెల్ సినిమాలో తాను గెస్ట్ రోల్ లో నటిస్తా అని మాట ఇచ్చారు మెగాస్టార్. పైగా లైవ్ షోలో మెగాస్టార్ ఈ మాట ఇచ్చారు. మరి ఇంతకీ మెగాస్టార్ చిరంజీవి మాట ఇచ్చినట్లు, ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో నటిస్తారా ? చిరు కోసం ఓ మంచి క్యారెక్టర్ ను అనుకున్నాడట దర్శకుడు. మరి చూడాలి చిరు ఏమంటాడో ? పాత్ర నచ్చితే చిరు చేసినా ఆశ్చర్యపొక్కర్లేదు. కాకపోతే చిరును కథతో ఒప్పించే దమ్ము కొత్త డైరెక్టర్ కి ఉందా అన్నదే ఇక్కడ డౌట్.

    Also Read: రమ్యకృష్ణకు నైట్ అవి ఉండాల్సిందేనట !

    కొత్త దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి దర్శకుడిగా ఈ సినిమా రాబోతుంది. మరి శ్రీనివాస్ వింజనంపాటి త్వరలో చిరుని కలిసి కథ చెప్పబోతున్నాడు. ఇచ్చిన మాటకి మెగాస్టార్ కట్టుబడి ఉంటాడా ? చూడాలి. ఇక నిర్మాత అప్పి రెడ్డి ఈ సబ్జెక్ట్ సెన్సేషన్ క్రేయేట్ చేస్తుందని, ఇండియాలోనే ఇటువంటి కాన్సెప్ట్ మూవీ రాలేదని, సోహైల్ తో మేము బిగ్ బాస్ కంటే ముందే కలసి మాట్లాడడం జరిగిందని, సోహైల్ కు ఇది బిగ్ గేమ్ చేంజర్ అవుతుందని నిర్మాత అప్పిరెడ్డి చెప్పుకొచ్చారు. సోహెల్ కూడా ఈ సినిమా పట్ల తెగ ఉత్సాహం చూపిస్తున్నాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్