పటాస్ చిత్రం నుంచి మొదలు పెట్టిన దర్శకుడు అనిల్ రావిపూడి ప్రయాణం.. సరిలేరు నీకెవ్వరు వరకు అప్రతిహతంగా కొనసాగింది . చేసిన ఐదు సినిమాలూ మంచి టాక్ నే తెచ్చుకోవడంతో మనోడి బ్రాండ్ వాల్యూ బాగానే పెరిగింది. అయితే.. ఊహించని విధంగా ‘గాలిసంపత్’ బాధ్యతలు తీసుకొని అందరినీ ఆశ్చర్య పరిచాడు. బ్యాక్ బోన్ గా తానే ఉన్నానంటూ ప్రకటించి, తన బ్రాండ్ మీదుగా సినిమా విడుదల చేశాడు.
Also Read: వర్మ నుండి మరో రాజకీయ సినిమా !
శివరాత్రికి విడుదలైన ఈ మూవీ దారుణ ఫలితాన్ని చవిచూసింది. మొదటి రోజు తర్వాత చాలా థియేటర్లలో ఈ సినిమాను తీసేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. విజయం వరించినప్పుడు విశ్లేషణలు పెద్దగా ఉండకపోవచ్చుగానీ.. అపజయాలు వచ్చినప్పుడు మాత్రం రంధ్రాణ్వేషణ కొనసాగుతుంది. ఇప్పుడు గాలి సంపత్ విషయంలోనూ ఇదే జరుగుతోంది.
Also Read: రమ్యకృష్ణకు నైట్ అవి ఉండాల్సిందేనట !
ఈ సినిమా విషయంలో దోషిగా అన్ని వేళ్లూ అనిల్ రావిపూడి వైపే చూపిస్తున్నాయి. కారణం.. ఈ సినిమా దర్శకుడు ఎవరో చాలా మందికి తెలియదు. అనిల్ బ్రాండ్ ప్రచారంలోకి రావడంతో అతని పేరే హైలైట్ అయ్యింది. అయితే.. కథ మంచిదే అయినప్పటికీ.. దానికి కమర్షియల్ హంగులు జోడించాలని చూశారని, దానివల్లే ఈ ఫలితం అని అంటున్నారు. ఇదంతా అనిల్ పుణ్యమే అని అంటున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
ఐదు సినిమాలకే ‘దర్శకత్వ పర్యవేక్షణ’ అని వేసుకోవడం ముందుగానే పెదవి విరుపులు వినిపించాయి. ఇప్పుడు.. సినిమా డిజాస్టర్ గా మిగలడంతో విమర్శల దాడి పెరిగింది. ఎంతో హడావిడి చేసి, అంతా తానే అని ప్రకటించిన అనిల్.. చివరకు ఇచ్చిన సినిమా ఇదా? అని ప్రశ్నిస్తున్నారు. బ్యాక్ ఎండ్ లో చేయాల్సిన సాయం చేసి ఊరుకుంటే పోయేదికదా.. ఇప్పుడు తన బ్రాండ్ కే ఎసరు తెచ్చుకున్నాడని అంటున్నారు. మొత్తంగా.. సినిమా నష్టం గురించి పక్కన పెడితే.. అనిల్ పేరుకు మాత్రం మరక అంటినట్టేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.